Nagababu : ఏపీలో నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 06:32 PM IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో చాలామంది ప్రజలు , యువత , నేతలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా జనసేన నేత నాగబాబు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో నాగబాబు ఫ్యామిలీ ఓటు వేసిందని వారు గుర్తు చేస్తున్నారు. పోలింగ్ బూత్ 168లో కొణిదెల నాగబాబు (సీరియల్‌ నెంబర్‌- 323), కొణిదెల పద్మజ (సీరియల్‌నెంబర్‌- 324), వరుణ్ తేజ్ (సీరియల్ నెంబర్ – 325) ఓటు హక్కు వినియోగించుకున్నారని.. ఇప్పుడు ఏపీలో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేసిన నాగబాబు..ఇప్పుడు ఏపీ లోనాగేంద్రబాబుగా మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కొన్ని ఆధారాలను ఆ పార్టీ పోస్ట్ చేసింది. నీతులు పక్క వాళ్లకు చెప్పడమేనా, మీరు ఏం పాటించడం లేదా అని వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

Read Also : TS : గతంలో మంత్రులకు సైతం ప్రవేశం లేని ప్రగతి భవన్ కు ఈరోజు సామాన్య ప్రజలు వస్తున్నారు – రేవంత్