Site icon HashtagU Telugu

Thefts : చంద్రబాబు పేరు చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలు

YCP

YCP

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు (YCP ) మరోసారి దొంగబుద్ధిని బయటపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జవహర్ కాలనీలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో (Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ కుటుంబాన్ని కలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, “ఫోన్ స్కాన్ చేస్తే చంద్రబాబు మోసాలు బయటపడతాయి” అంటూ నమ్మించి కౌంట్ లో ఉన్న డబ్బులు కొట్టేసారు.

Kolkata : లా విద్యార్థినిపై అత్యాచార ఘటన.. సెక్యూరిటీగార్డు అరెస్ట్

బోయ ఎర్రప్ప అనే వ్యక్తి వద్దకు వెళ్లిన కార్యకర్తలు, ఆయన ఫోన్ తీసుకుని ఫోన్ పే స్కాన్ చేసి రూ.11,000 వరకు అకౌంట్లో ఉన్న మొత్తాన్ని కాజేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దొంగలు ఆ మొత్తాన్ని కట్ చేసిన సందేశాన్ని కూడా ఫోన్ నుంచి డిలీట్ చేసి తమ పని పూర్తిచేసినట్లు సమాచారం. ఎర్రప్ప సాయంత్రం షాపులో కొనుగోలు చేసిన వాటికి చెల్లింపులు చేయడానికి ఫోన్ పే ఉపయోగించగా ‘బ్యాలెన్స్ జీరో’గా కనిపించడంతో అసలు విషయం బయటపడింది.

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. తెరపైకి కవిత పీఏ పేరు

ఈ ఘటనపై తీవ్ర ఆవేదనకు గురైన ఎర్రప్ప అనంతపురం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అకౌంట్లో ఉన్న మొత్తాన్ని కాజేసినందుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని దోపిడీకి ఉపయోగించుకుంటూ రాజకీయ కార్యక్రమాల అడ్డుపెట్టుకొని మోసాలు చేయడం పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version