నాయకులు (Leaders), కార్యకర్తలు పార్టీలు మారడం అనేది రాజకీయాల్లో (Politics) చాలా కామన్. సొంత పార్టీల్లో ఉంటూ అప్పటివరకు ప్రచారంలో నాయకులు సైతం ఇతర పార్టీ కండువా కప్పుకోవడం చాలాస్లారు చూశాం. కానీ ఓ కార్యకర్త తన సొంత పార్టీని విడిచిపెట్టినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక జీవితంలో మళ్లీ తప్పు చేయనంటూ పార్టీ నాయకురాలి కాళ్లు పట్టుకొని మరీ వేడుకున్నాడు. ప్రస్తుతం ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని, తనను క్షమించాలని వేడుకుంటూ ఓ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) కాళ్లపై పడి వేడుకున్నాడు. అనంతపురం (Ananathapuram) జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో చోటుచేసుకుంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ లో భాగంగా పరిటాల సునీత ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు సునీత కాళ్లపై పడి తనను క్షమించాలని వేడుకున్నాడు.
వైసీపీ (YCP)లో చేరి తప్పుచేశానని, తనను మళ్లీ టీడీపీలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డాడు. రామాంజనేయులను పైకి లేపిన సునీత (Paritala Sunitha).. మీలాంటి వారికి పార్టీలో ఎప్పటికీ స్థానం ఉంటుందంటూ కండువా కప్పి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న కార్యకర్త వీడియో సోషల్ మీడియాలో (Viral Video) చర్చనీయాంశమవుతోంది.
Also Read: NBK and PSPK: వీర సింహా రెడ్డితో ‘వీరమల్లు’.. ఫ్యాన్స్ కు పూనకాలే!