Site icon HashtagU Telugu

Power Star Whisky : ఏపీలో ‘పవర్ స్టార్’ విస్కీ – వైసీపీ విమర్శలు

Powerstar Whikky

Powerstar Whikky

కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ (Power Star Whisky) పేరుతో కొత్త బ్రాండ్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ ట్విట్టర్ వేదికగా విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్ను తెచ్చిందని ఆరోపించడం ఫై కూటమి శ్రేణులు వైసీపీ ఫై ఎదురుదాడికి దిగారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ వచ్చింది. ఇందులో వైసీపీ కార్యకర్తలే జీతాలకు పనిచేసారు. ప్రభుత్వమే నడపనీ, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వనీ ప్రజలకు కావాల్సింది క్వాలిటీ. కానీ జగన్ పాలనలో ఆ ఒక్కటే అడగకూడదు అన్నట్లు జరిగింది. గతంలో ఎన్నడూ చూడని.. ఎప్పుడూ వినని బ్రాండ్లు, సీసాలు ఏపీలో కనిపించాయి. దీనికి అప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న జనసేన, టిడిపి , బిజెపి పార్టీలు జే బ్రాండ్ మద్యం అంటూ పేరు కూడా పెట్టారు. ఈ జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది రుగ్మతలకు మద్యమే కారణమని ఆరోపించించాయి. కనీస పరీక్షలు కూడా చేయకుండా మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి ప్రభుత్వ దుకాణాలకు అందిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఎన్నికల ప్రచారంలోనూ జగన్ బ్రాండ్ లపై గట్టిగానే బాబు స్వరం వినిపించారు. కూటమి అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని , తక్కువ ధరలకే అందిస్తామని మందుబాబులకు భరోసా కల్పించారు. అలాగే అధికారంలోకి రాగానే పాత బ్రాండ్స్ ను తీసుకొచ్చారు కూడా.. అయితే కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ తాజాగా సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన కౌంటర్ ఇస్తున్నాయి. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను జగన్ తీశారని దుయ్యబట్టాయి. ఈ బ్రాండ్లు అన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొంటున్నాయి. మరి నిజంగా ఈ బ్రాండ్ ను కూటమి తెచ్చిందా లేదా అనేది రాష్ట్ర మందు బాబులకే తెలియాలి.

Read Also : Salman Khan : కారులోనే సల్మాన్‌ హత్యకు కుట్ర.. రూ.25 లక్షలకు కాంట్రాక్ట్‌.. 70 మంది రెక్కీ