వైసీపీ (YCP) నేతలతో పాటు శ్రేణులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐదో లిస్ట్ (YCP 5th List ) వచ్చేసింది. ఈ లిస్ట్ లో ఎంతమంది ఇంచార్జ్ పదవులు దక్కుతాయో అని వెయ్యి కళ్లతో ఎదురుచూడగా..అధిష్టానం మాత్రం కేవలం ఏడుగురితో కూడిన ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఐదో జాబితా చూస్తే (YCP 5th List Released)..
అరుకు వేలీ (ఎస్టీ): రేగం మత్స్య లింగం
కాకినాడ (ఎంపీ): చలమలశెట్టి సునీల్
మచిలీపట్నం (ఎంపీ): సింహాద్రి రమేష్ బాబు
అవనిగడ్డ: డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు
నర్సారావుపేట (ఎంపీ): పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
సత్యవేడు (ఎస్సీ): నూకతోటి రాజేష్
తిరుపతి (ఎస్సీ) పార్లమెంట్: మద్దిల గురుమూర్తి.
ఇప్పటివరకు నాలుగు జాబితాలు విడుదల చేసిన జగన్.. 58 అసెంబ్లీ, 10 లోక్ సభ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ఇక ఇప్పుడు ఐదో లిస్ట్ లో మాత్రం 4 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో.. అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేశ్ ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే ప్రముఖ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును(అంకాలజిస్ట్, క్యాన్సర్ వైద్య నిపుణులు), సింహాద్రి రమేశ్ కు స్వయాన సోదరుడు.. సింహాద్రి చంద్రశేఖర్ ను అవనిగడ్డ అసెంబ్లీ ఇంఛార్జిగా ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడం తో ఆయన స్థానంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తికే అవకాశం దక్కింది. గతంలో గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం ఎదురు తిరిగిన నేపథ్యంలో తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ గురుమూర్తి కి అవకాశం ఇచ్చారు. అరకు ఇంఛార్జ్ గా గొడ్డేటి మాధవిని ప్రకటించగా.. తాజాగా మాధవి స్థానంలో రేగం మత్స్యలింగంని అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఈ లిస్ట్ తర్వాత అసమ్మతి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇదిలా ఉంటె ఎంపీ విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు విజయసాయిరెడ్డికి, ఒంగోలు పార్లమెంట్, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని నియమించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది.
Read Also : AP : విజయసాయిరెడ్డికి షర్మిల ప్రశ్నల వర్షం..సమాధానం చెపుతారా..?