గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలు గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న అరాచక పాలన, అక్రమాలు, ప్రైవేట్ పంచాయతీలు వంటి సమస్యలకు ముగింపు పలుకుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. అంబాపురం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, ప్రభుత్వ నిధులను పారదర్శకంగా వినియోగించి గ్రామాలు , వార్డులను అభివృద్ధి చేయడం తమ ద్యేయమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు లేకుండా 1.28 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.78 లక్షలు, యువత క్రీడా సామర్థ్యాన్ని వెలికితీయడానికి క్రికెట్ బాక్స్ నిర్మాణానికి రూ.12 లక్షలు, గ్రామ రహదారుల నిర్మాణానికి రూ.20.60 లక్షల నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు గ్రామస్తుల నిత్యజీవితంలో కీలకమైన మార్పును తీసుకొస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
India Loses Toss: టీమిండియా ఖాతాలో మరో చెత్త రికార్డు!
గత పాలకుల కాలంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమించబడిన విషయాన్ని ఎత్తిచూసిన యార్లగడ్డ, భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంటుందని గుర్తించారు. అక్రమాలను భరించాల్సిన అవసరం లేదని, ఏ ఆక్రమణ జరిగినా అధికారులకు లేదా తమ కార్యాలయానికి తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ భూముల స్వాధీనంపై ఇప్పటికే ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని, గ్రామస్థులు అందుబాటులో ఉన్న అన్ని వివరాలను కమిటీకి అందిస్తే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని చెప్పారు. ప్రజల సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని అక్రమ రహిత ప్రాంతంగా మార్చడం తాము చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటని స్పష్టం చేశారు.
Team India: టీమిండియాలో గొడవలు.. ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది?!
గ్రామీణ యువత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని, పరిశ్రమలు–సేవా రంగంలో మరిన్ని అవకాశాలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను తగ్గించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. గన్నవరం ప్రాంతాన్ని పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పి. నైనవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ ప్రతిపాదనకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్పారు. స్థానికుల అభ్యర్థన మేరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులు లేదా ఎంపీ ఫండ్స్ ద్వారా నిధులు తీసుకొచ్చేందుకు హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి నాయకత్వం వహిస్తున్న వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గ్రామం అభివృద్ధికి కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
