ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే. నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్లలో లభించదనే భావనతో చాలామంది ప్రవైట్ స్కూల్స్ లలో చేర్పిస్తుంటే..ఆర్ధిక స్థోమత లేని వారు మాత్రం తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లలో చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ రోజు (డిసెంబర్ 5, 2025) రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45,000 ప్రభుత్వ, సహాయక పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ -3.0 (PTM-3.0) ను విజయవంతంగా నిర్వహించారు.
Tri-Service Guard Of Honour: త్రి-సేవా గార్డ్ ఆఫ్ ఆనర్.. దాని అర్థం ఏమిటి?
ఈ మెగా PTM కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ పార్వతీపురం మన్యం జిల్లాలో పాల్గొనగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిలకలూరిపేటలో పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మండలం గొల్లనపల్లిలోని పి.ఎమ్. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం చదువు గొప్పతనం , మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ ద్వారా కలిగే లాభాలు , ప్రభుత్వ స్కూల్స్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు , ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల కోసం చేస్తున్న కృషి తదితర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. PTM కాన్సెప్ట్ సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలో ఉండేది కాగా, నారా లోకేష్ దీనిని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి, తల్లిదండ్రులకు తమ బిడ్డ చదువుల పురోగతిని టీచర్ల వద్ద నుంచి తెలుసుకునే అవకాశం కల్పించారని గుర్తు చేసారు.
విద్యాశాఖలో మెరుగుదల అంటే కేవలం స్కూళ్లకు రంగులు వేయడం కాదని, విద్యా ప్రమాణాలు పెంచడం ముఖ్యమని లోకేష్ ప్రణాళికాబద్ధంగా పని చేసుకుంటూ వస్తున్నారని కొనియాడారు. ముందుగా డీఎస్సీ నిర్వహించి టీచర్లను అందుబాటులోకి తీసుకురావడం, స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపరచడం వంటి చర్యలు కార్పొరేట్ స్థాయి విద్యకు తగ్గట్లుగా మార్పులు తీసుకువస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం జరిగిన విద్యాశాఖను దారిలో పెట్టడం రాత్రికి రాత్రే సాధ్యం కాకపోయినా, నారా లోకేష్ చాలా వేగంగా చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల ఆశలను , కలలను నెరవేర్చాలని హితవు పలికారు. స్కూల్ లైఫ్ ఎప్పటికి మరచిపోలేంది అని ఇలాంటి గొప్ప అవకాశం తిరిగి రాదని..ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే స్కూల్స్ వద్ద స్పీడ్ బ్రేక్స్ ఉండేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
