Site icon HashtagU Telugu

Shock To CM Jagan: ఎన్టీఆర్ ఎఫెక్ట్‌, వైసీపీలో రాజీనామాల ప‌ర్వం

Ntr Effect

Ntr Effect

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పును నిర‌సిస్తూ వైసీపీలో రాజీనామాల ప‌ర్వం ప్రారంభం అయింది. అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు యార్ల‌గ‌డ్డ లక్ష్మీప్ర‌సాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి కూడా రాజీనామా దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. వాళ్ల‌తో పాటు అసెంబ్లీ వేదిక‌గా కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు జ‌గ‌న్ నిర్ణ‌యం మీద లోలోప‌ల మ‌థ‌న‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే అసంతృప్తిగా ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామా ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కు జ‌రుగుతోన్న అవ‌మానాన్ని నిర‌సిస్తూ వైసీపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఇదే మంచి త‌రుణంగా వాళ్లు భావిస్తున్న‌ట్టు వినికిడి.

ఇటీవ‌ల స‌ర్వేలు సేక‌రించిన జగన్ మోహన్ రెడ్డి 60 నుంచి 70 మంది సిట్టింగ్ ల‌ను ఈసారి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంచాల‌ని భావించార‌ట‌. ఇప్ప‌టికే ఒక‌సారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షుల‌తో స‌మావేశం అయిన జగన్ మోహన్ రెడ్డి, వాళ్ల ప‌నితీరుకు రేటింగ్ ఇచ్చారు. గ్రాఫ్ పెంచుకోవ‌డానికి ఎనిమిది నెల‌లు టైమ్ ఇస్తున్నాన‌ని చెప్పిన విష‌యం విదిత‌మే. అంతేకాదు, ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ, మంత్రుల‌తో కూడిన బ‌స్సుల ద్వారా సామాజిక భేరిని నిర్వ‌హించారు. అయిన‌ప్ప‌టికీ కేవ‌లం ఆరుగురు ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్ర‌మే మెరుగుప‌డింద‌ని తాజా స‌ర్వేల్లోని సారంశ‌మ‌ట‌. మిగిలిన వాళ్ల‌కు 2024 ఎన్నిక‌ల్లో టిక్కెట్ లేద‌ని ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు జగన్ మోహన్ రెడ్డి తీరుపై ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

Also Read:   Chandrababu Comments : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్ కు ఏం సంబంధం.. ? – చంద్రబాబు

స‌రైన స‌మ‌యంలో పార్టీ నుంచి బ‌య‌ట ప‌డాల‌ని గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేలు సిద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్చుతోన్న బిల్లు పెడుతోన్న క్ర‌మంలో ఆ కార‌ణాన్ని చూపుతూ బ‌య‌ట ప‌డాల‌ని మోజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఒక వేళ అదే జ‌రిగితే, బీజేపీ కూడా సిద్ధంగా ఉంది. వాళ్లంద‌రిపై ఆప‌రేష‌న్ ఆకర్ష్ ను ప్ర‌యోగించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఇప్ప‌టికే కొంద‌రు టీడీపీలో స్థానాన్ని రిజ‌ర్వు చేసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రికొంద‌రు బీజేపీలోకి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వానికి కూడా గండికొట్టే ప్ర‌య‌త్నం బీజేపీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే, మూడేళ్ల క్రితం మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెప్పిన జోస్యం ఫ‌లించ‌డానికి అవ‌కాశం ఉంది.

Also Read:   AP Assembly : ఏపీ అసెంబ్లీలో ర‌గ‌డ‌… ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు..?

ఏపీ చ‌రిత్ర‌లో 50శాతానికి మించిన ఓటు బ్యాంకు తెచ్చుకున్న పార్టీ పూర్తి కాలం అధికారంలో లేదు. ఆ విష‌యాన్ని మూడేళ్ల క్రిత‌మే ఉండ‌వ‌ల్లి గుర్తు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వం ఐదేళ్లు ఉంటుంద‌ని న‌మ్మ‌కంలేద‌ని జోస్యం ఆనాడే చెప్పారు. అంతేకాదు, 50శాతం పైగా ఓటు బ్యాంకును జగన్ మోహన్ రెడ్డి స‌ర్కార్ 2019 ఎన్నిక‌ల్లో సాధించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. స్వ‌ర్గీయ పీవీ, ఎన్టీఆర్ ప్ర‌భుత్వాలు పూర్వం 50శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించి సీఎంలు అయ్యారు. కానీ, పూర్తి కాలం ఆ స‌మ‌యంలో వాళ్లిద్ద‌రూ ప‌నిచేయ‌లేక‌పోయారు. మ‌ధ్య‌లోనే ప‌ద‌వుల‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప‌రిస్థితి కూడా అంతేనంటూ మూడేళ్ల క్రితం ఉండ‌వ‌ల్లి చెప్పిన జోస్యం సాకారం కావ‌డానికి యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ రాజీనామాతో బీజం ప‌డింది. ఈ రాజీనామాల ప‌ర్వం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.