Yanamala Krishnudu : టీడీపీ కి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు

టీడీపీ తుని అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ను ప్రకటించడం తో కృష్ణుడు..పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ కి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు

Published By: HashtagU Telugu Desk
Yanamala Krishnudu Ycp

Yanamala Krishnudu Ycp

మరో మూడు వారాల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో టీడీపీ పార్టీ (TDP)కి భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) పార్టీకి రాజీనామా చేసి ..వైసీపీ (YCP) లో చేరేందుకు సిద్దమయ్యాడు. గత కొంతకాలంగా యనమల సోదరుల మధ్య విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీడీపీ తుని అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ను ప్రకటించడం తో కృష్ణుడు..పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ కి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. తన రాజీనామా లేఖను ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ అధినేత చంద్రబాబుకు పంపించారు. శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..42 ఏళ్లు టీడీపీ పార్టీ కోసం పనిచేసాను..కానీ ఇప్పుడు పార్టీ మారడం బాధగా ఉందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తుని అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడానికి పనిచేస్తానని , మోసపూరిత రాజకీయాలను వదలక తప్పలేదని.. తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పని చేశారని కృష్ణుడు ఆరోపించారు. రెండుసార్లు తునిలో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన ఈయన.. మూడోసారి టికెట్‌ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

Read Also : Vijay Mallya: విజ‌య్ మాల్యా కోసం ఫ్రాన్స్‌కు భార‌త్ విజ్ఞప్తి

  Last Updated: 26 Apr 2024, 03:19 PM IST