Yanamala Krishnudu : జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న యనమల కృష్ణుడు

తాడేపల్లిలోని జగన్ క్యాంప్‌ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు

Published By: HashtagU Telugu Desk
Yanamla Krishnudu Ycp

Yanamla Krishnudu Ycp

యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) మొత్తానికి వైసీపీ (YCP) కండువా కప్పుకొని అన్న ఫై ప్రతీకారం , టీడీపీ ఫై ఆగ్రహం తీర్చుకోబోతున్నాడు. టీడీపీ తనకు కాకుండా తన సోదరుడి కూతురు దివ్య కు టికెట్ ఇచ్చిందనే కోపం తో ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొని టీడీపీ కి షాక్ ఇచ్చాడు. గత కొంతకాలంగా యనమల సోదరుల మధ్య విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీడీపీ తుని అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ను ప్రకటించడం తో కృష్ణుడు..పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు. గత కొద్దీ రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కృష్ణుడు..నిన్న టీడీపీ కి రాజీనామా చేసి, తన రాజీనామా లేఖను టీడీపీ పార్టీ జాతీయ అధినేత చంద్రబాబుకు పంపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..42 ఏళ్లు టీడీపీ పార్టీ కోసం పనిచేసాను..కానీ ఇప్పుడు పార్టీ మారడం బాధగా ఉందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తుని అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడానికి పనిచేస్తానని , మోసపూరిత రాజకీయాలను వదలక తప్పలేదని.. తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పని చేశారని కృష్ణుడు ఆరోపించారు. ఈరోజు తాడేపల్లిలోని జగన్ క్యాంప్‌ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈయనతో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరి రావు, పి.హరికృష్ణ, ఎల్‌.భాస్కర్‌ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Read Also : Telegram Down In India: భార‌త్‌లో టెలిగ్రామ్ డౌన్‌.. అయోమ‌యానికి గురైన యూజ‌ర్స్‌..!

  Last Updated: 27 Apr 2024, 05:14 PM IST