ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (Yamini Krishnamurthy ) (84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో 7 నెలల నుంచి ఐసీయూలోనే చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి ఇక లేరు అని తెలిసి నృత్య కళాకారులతో పాటు యావత్ సినీ , రాజకీయ , అభిమానులంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది. ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. అటుపై వాళ్ల కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో పేరు ఎంతో పేరు తెచ్చుకుంది. యామినీ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా పని చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నృత్య కేంద్రం స్థాపించి పలువురికి శిక్షణ ఇచ్చారు. ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవకు కేంద్రం తొలిసారిగా 1968లో పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందింది. అలాగే, 1977లో సంగీతనాటక అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు.
Read Also : IPL 2025: చెన్నై గూటికి ఆర్సీబీ కెప్టెన్