Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ‘వై’ ప్ల‌స్ సెక్యూరిటీ కేటాయించిన ప్రభుత్వం

Y Plus Security For Pawan K

Y Plus Security For Pawan K

ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కు భద్రతను పెంచింది ఏపీ సర్కార్. ఆయ‌న‌కు వై ప్ల‌స్ సెక్యూరిటీ (Y Plus Security)తో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. పవన్ కళ్యాణ్ రేపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ సచివాలయంకు రానున్నారు. మంత్రిగా రేపు బాధ్య‌త‌లు చేపట్టనున్న క్రమంలో తన ఛాంబర్ ను ఆయన పరిశీలించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని పవన్ కోసం సిద్ధం చేసారు. జ‌న‌సేన మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంత‌స్తులో ఛాంబ‌ర్లు కేటాయించారు. అలాగే పవన్‌కల్యాణ్‌ క్యాంప్‌ కార్యాలయంగా ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్ ను ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్ ను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు విశాలంగా నిర్మించారు. తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ గెస్ట్‌హౌ్‌సను కేటాయించారు. అలాగే, సచివాలయంలో గతంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీ ఐదో బ్లాక్‌లో ఉండేది.

ఇప్పుడు పవన్‌తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గే్‌షకు కూడా రెండో బ్లాక్‌లో మొదటి అంతస్తులో కేటాయించారు. ఇప్పటికే ఈ బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేషీని మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్‌ వద్ద ఉండటంతో, పవన్‌ పేషీలు రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.

Read Also : Jagan EVM Tweet : అప్పుడు ముద్దు..ఇప్పుడు వద్దు..ఏందన్న జగనన్న