అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ (YSR Sampoorna Poshana Kit) లలో పాము కళేబరాలు, పురుగులు కనిపిస్తుండడంతో గర్భిణీ లు షాక్ కు గురి అవుతున్నారు. మాకు ఈ కిట్లు వద్దే వద్దు..మా డబ్బులు పెట్టి మీము కొనుకుంటాం..కానీ ప్రభుత్వం ఫ్రీ పేరు చెప్పి మా ప్రాణాలు తియ్యకండి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్ లో మానస (Pregnant Women Manasa) అనే గర్భిణి.. ఆ అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని సీమంతం నిర్వహించుకునేందుకు తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రెడ్డి కల్యాణి సాయంతో సీడీపీఓ వాణిశ్రీదేవికి సమాచారం అందించింది. కాగా, ప్యాకెట్లో పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని సీడీపీఓ అంగీకరించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా…తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
కృష్ణా జిల్లాలో గూడూరు (Gudur) పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన కిట్లలో పాడైపోయిన ఖర్జూర పళ్లను ఓ మహిళ గుర్తించింది. పుచ్చిపోయిన ఖర్జూరంలో పురుగులూ (Worms) ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివే గ్రామంలో మరో ఇద్దరికి సరఫరా అయినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు పాలూ బాగుండటం లేదని .. వేరుసెనగ చిక్కీలూ ప్యాకెట్లలో సగమే ఉంటున్నాయని వాపోయారు. ఈ విషయంపై సీడీపీవో గ్లోరిని వివరణ కోరగా కేవలం ఒకరిద్దరికి ఇచ్చిన ఖర్జూరే పాడైనట్లు తెలిసిందని, వెంటనే వారికి కొత్తవి ఇచ్చామన్నారు. ఇలా పాడైపోయినవి ఇచ్చి మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారంతా వాపోతున్నారు.
Read Also : IT Seizes 42 Crores : తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక డబ్బు..బెంగుళూరులో రూ.42 కోట్లు సీజ్