భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీ..ఏపీ ప్రభుత్వం ఫై విమర్శలు చేసింది. ఐదేళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని, దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని అంబేద్కర్ మహనీయుడి విగ్రహం వెనుక దాచిపెట్టాలని జగన్ చూస్తున్నాడని విమర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
నా ఎస్సీలు, నా ఎస్టీలు అని దీర్ఘాలు తీసే జగన్ కు దళితులపై తాను పలికే చిలక పలుకుల్లో పావు శాతమైనా ప్రేమ ఉంటే… దళితులపై ఇన్ని దారుణాలు జరిగేవా? అని ప్రశ్నించింది. అంబేద్కర్ మహనీయుడు కోరుకున్నది ఎన్నికల వరకు పథకాలు, ఎన్నికలప్పుడు విగ్రహాల ఏర్పాటా? అని అడిగింది. సమాజంలో దళితులపై వివక్ష పోవాలని అంబేద్కర్ అనుకున్నారని… కానీ, కంసమామ జగన్ దళితులని హత్యలు చేసిన వారిని చేరదీస్తున్నాడని దుయ్యబట్టింది.
ఇక అంబేద్కర్ విగ్రహం విషయానికి వస్తే..
85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ఇక్కడ ప్రతిష్టించారు. దీంతో మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పేరు మార్చారు. ఇక్కడ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాడింగ్ తో తయారు చేశారు. ఈ విగ్రహం పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహా మండలంగా రూపొందించారు. ఈ నిర్మాణం మొత్తం పైల్ ఫౌండేషన్‌తో 30మీటర్ల పైల్ లోతు, షీర్ గోడలు, 50డిగ్రీల వంపుతిరిగిన ఆర్సీసీ స్లాబ్‌లు, బీమ్‌లతో 539 పైల్స్‌తో తయారు చేశారు. పెడెస్టల్ బిల్డింగ్ మొత్తం 11,140 కమ్ కాంక్రీటు, 1445MT టీఎంటీతో తయారు చేశారు. రాజస్థాన్ నుండి పింక్ ఇసుకరాయితో క్లాడింగ్ చేశారు.
అంబేద్కర్ స్మారక చిహ్నం ముందుభాగంలో ఆరు జలవనరులు ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, పీఠం భవనం, పచ్చదనం కోసం 3 వైపుల పెరిఫెరల్ వాటర్‌బాడీతో ప్రకృతిని మైమరపింప చేస్తోంది. కాలచక్ర మహా మండప భవనం లోపల విగ్రహం క్రింద అంబేద్కర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. బేస్మెంట్ లో కన్వెన్షన్ సెంటర్ కూడా అందుబాటులో ఉంచారు. అలాగే 8 వేల చదరపు అడుగుల్లో ఫుడ్ కోర్ట్ నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం తూర్పు, పడమర వైపు స్ధలం కేటాయించారు. ఇందులో 95 కార్లు, 84 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.
Read Also : January 22 : రామమందిరం ప్రారంభోత్సవం రోజున రాశిఫలాలివీ..