Earth Hour 2025 : ఈరోజు(శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు విద్యుత్ వాడకం ఆపేయాలని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆ టైంలో ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు సహా తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలను ఆఫ్ చేయాలని ఆయన కోరారు. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ? ఈ రోజు (మార్చి 22) వరల్డ్ ఎర్త్ అవర్. అందుకే పర్యావరణ హితం కోసం ఆ గంట వ్యవధి పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపాలని ప్రజానీకానికి చంద్రబాబు సూచించారు. దీంతోపాటు వరల్డ్ ఎర్త్ అవర్ కూడా ఇవాళే. ఈ రెండు అరుదైన దినోత్సవాలు ఒకేరోజు రావడంపై ఏపీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి సామాజిక ప్రయోజనాలు, పర్యావరణ హితం కోసం ప్రపంచ ప్రజలను ఇలాంటి దినోత్సవాలు ఏకం చేస్తున్నాయన్నారు. ఎర్త్ అవర్ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటారని సీఎం పేర్కొన్నారు. ‘‘అన్ని జీవరాశులకు భూమే ఏకైక ఇల్లు. దీన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read :Pak Cricketer: బ్యాట్‌లకు డబ్బు చెల్లించకుండా అమెరికా నుంచి పారిపోయిన పాక్ క్రికెటర్!
స్వర్ణ ఆంధ్ర-2047 మార్గదర్శక సూత్రాల్లోనూ..
‘‘మానవ జీవితంలో నీరు, విద్యుత్ అనేవి ముఖ్యమైన మూల స్తంభాలు. వీటి ప్రాముఖ్యతను గుర్తించబట్టే నీటి పొదుపు, ఇంధన వ్యయం తగ్గింపు వంటి అంశాలను స్వర్ణ ఆంధ్ర-2047 మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచాం. వీటిని పొదుపుగా వాడుకుంటేనే స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు(Earth Hour 2025) పేర్కొన్నారు. ‘‘చిన్నచిన్న పొదుపు చర్యలే రేపటి పెద్దపెద్ద మార్పులకు దారితీస్తాయి. అంతా కలిసి పని చేస్తే ప్రభావవంతమైన మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్ పొదుపు విషయంలో వ్యక్తిగతంగా పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని ఆయన కోరారు.
Also Read :Bird flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..
190కిపైగా దేశాల్లో ఎర్త్ అవర్.. లక్ష్యం ఇదే
ఈరోజు రాత్రి(మార్చి 22) ప్రపంచం ఎర్త్ అవర్ జరగబోతోంది. “స్విచ్ ఆఫ్ అండ్ సెక్యూర్ వాటర్ ఫర్ ఆల్” అనేది ఈ సంవత్సరం ఎర్త్ అవర్ నినాదం. 190కిపైగా దేశాలలో ఎర్త్ అవర్ ను పాటించనున్నారు. ఎర్త్ అవర్‌ను 2007 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అత్యంత కీలకమైన ఇంధన వనరులను భవిష్యత్తు తరాల కోసం భద్రపర్చాలనేది ఎర్త్ అవర్ ఉద్యమం లక్ష్యం.