Site icon HashtagU Telugu

Modi Vizag Tour: విశాఖ‌ ప‌ర్య‌ట‌న‌కు ముందే `మోడీ`కి నిర‌స‌న సెగ‌

Vizag Protest

Vizag Protest

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విశాఖ ప‌ర్య‌ట‌న ఈనెల 11వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఆ రోజున విశాఖప‌ట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా విధుల‌ను బ‌హిష్క‌రించ‌డానికి కార్మికులు సిద్ధం అయ్యారు. ఆ మేర‌కు బుధ‌వారం జ‌రిగిన కార్మికుల నిర‌స‌న ర్యాలీ సంద‌ర్భంగా తీర్మానించారు. కేంద్రం వాటాను ప్లాంట్ నుంచి ఉపసంహరించుకునే యోచనపై కేంద్రంపై కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓడరేవు నగరాన్ని సందర్శించడానికి కొన్ని రోజుల ముందు నిరసనలు మొద‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్‌ఐఎన్‌ఎల్-విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (విఎస్‌పి)కి చెందిన 10,000 మందికి పైగా కార్మికులు ప్రధాని మోదీ పర్యటన రోజైన శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. స‌మితి ఆధ్వర్యంలో గుర్రంపాలెం నుండి ద్వారకానగర్‌లోని జివిఎంసి కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు 1,000 మందికి పైగా భారీ బైక్ ర్యాలీని నిర్వ‌హించ‌డం ద్వారా వైజాగ్‌లో ప్రధాని మోడీకి నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించింది.

Also Read:  AP Medical Colleges: ‘ఎడ్యుకేషన్’ బిజినెస్ కాదు.. ఏపీ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!

ప్రధాని నవంబర్ 11 రాత్రి విశాఖపట్నంలో ల్యాండ్ అవుతారు. మరుసటి రోజు అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. HPCL పెట్రోలియం రిఫైనరీ రూ. 26,000 కోట్ల విస్తరణ ఆధునీకరణ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం కొత్త గ్రీన్ క్యాంపస్ మొదటి దశ మరియు విశాఖపట్నం పోర్ట్‌లో క్రూయిజ్ టెర్మినల్ వంటివి మోడీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాయి. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి, 400 పడకల స్పెషాలిటీ ఇఎస్‌ఐ ఆస్పత్రి (రూ. 385 కోట్లు), ఆధునిక మెగా ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. నవంబర్ 12న ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

మోడీ ప‌ర్య‌ట‌న ఆద్యంత‌మూ నిర‌స‌న తెల‌పాల‌ని కార్మిక సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న స్థాయిని ప్ర‌ధానికి రుచిచూపించాల‌ని భావిస్తున్నారు. ఆ క్ర‌మంలో పోలీసులు ముంద‌స్తుగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ రెండు రోజుల ముందు నుంచే మోడీ ప‌ర్య‌ట‌న‌కు నిర‌స‌న‌లు వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read:  PM Modi Tour: `మోడీ`కి మోదం, ఖేదం!

Exit mobile version