AP Rains: వైజాగ్‌కు మరో గండం

భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.

 • Written By:
 • Updated On - November 20, 2021 / 12:25 AM IST

ఏపీలో వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఏపీ వాన‌ల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇక్క‌డ తెలుసుకోవ‌చ్చు.

LIVE NEWS & UPDATES

 • 20 Nov 2021 09:53 AM (IST)

  Kadapa update

  కడప జిల్లా :రాజంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో NDRF బృందాల గాలింపు.

  వరద తగ్గు ముఖం పట్టటంతో గత రాత్రి నుండి మందపల్లి,పులపుత్తూరు గ్రామాల్లో గాలింపు చర్యలు.

  మైలవరం డ్యాం నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు పెన్నాకు విడుదల.

  రోడ్డు,రైలు మార్గాలు పాక్షికంగా దెబ్బతినడంతో ఆగిన రవాణా వ్యవస్థ.

  కడప తిరుపతి మధ్య ఆగిపోయిన రైల్,రోడ్డు మార్గాలు.

 • 20 Nov 2021 09:07 AM (IST)

  కదిరి పట్టణం లో భారీ కుండపోత వర్షాలకు గోడలు

  కదిరి పట్టణం చెర్మాన్ వీధి లో భారీ కుండపోత వర్షాలకు గోడలు తడిసి మెత్తబడి శనివారం ఉదయం భవంతి కూలిపోవడంతో పక్కనే ఉన్న మరో భవంతి పైన పడడంతో ఆ భవంతి కుప్పకూలింది.

  ఈ ఘటనలో 15 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. కదిరి భవనాల కూలిపోయిన ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు, వారిలో సైదున్నీ సా 3 సంవత్సరాలు ఫరిదున్నిసా 2 సంవత్సరాల ఒక భవనం కూలి మరో భవనంపై పడడంతో ఆ భవనం నేలమట్టం కాగా దారుణం చోటుచేసుకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  సహాయక చర్యలు ఈ ఘటనలో ఒక ఇంట్లో ఎనిమిది మంది మరో ఇంట్లో ఏడు మంది మొత్తం 15 మంది చిక్కుకోగా అందులో 6 మందిని సురక్షితంగా బయటికి తీశారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

   

 • 20 Nov 2021 08:57 AM (IST)

  Anantapur update

  అనంతపురం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యల్లనూరు మండలం గోడ్డుమర్రి రిజర్వాయర్‌కు గండి పడింది. ఆనకట్ట తెగిపోవడంతో చిలమకూరు గ్రామంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు చిలమకూరు గ్రామాన్ని ఖాళీ చేసి మోడల్ స్కూల్‌కి వెళ్తున్నారు. చిత్రావతినది కి వరద రావడంతో పరివాహక ప్రాంతంలోని గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.

 • 20 Nov 2021 08:55 AM (IST)

  Kadapa update

  చిత్తూరు: బంగారుపాలెం మండలం టేకుమంద వద్ద వాగులో కొట్టుకుపోయి నలుగురు మహిళలు గల్లంతయ్యారు. ఒక మహిళ మృతదేహం లభ్యం కాగా...ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. అటు పుంగనూరు పట్టణంలో వరద ఉధృతి తగ్గని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయమవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 • 20 Nov 2021 08:29 AM (IST)

  Kadapa rains

  జమ్మలమడుగు (కడప జిల్లా): ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది ఎగువ నుంచి భారీగా వరద జలాలు మైలవరం డ్యాం లో చేరుతుంది, దీంతో మైలవరం డ్యాం 11 గేట్ల ద్వారా లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల.

  # మైలవరం ఏఈఈ గౌతంరెడ్డి:

  మైలవరం ఆనకట్టకు ఎలాంటి ప్రమాదం లేదు.పుకార్లు నమ్మవద్దు. వేపరాల గ్రామం లోనికి నీరు వెళ్లకుండా మట్టి కట్టలు వేశారు.
  వేపరాల గ్రామస్థులు, పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

 • 20 Nov 2021 08:27 AM (IST)

  Tirumala update

  తిరుపతి :తెరుచుకున్న తిరుమల రెండు ఘాట్ రోడ్లు .... యథావిధిగా రాకపోకలు.

  అలిపిరి పాదాలు, శ్రీవారి మెట్ల మార్గం గుండా భారీగా వరద నీరు.

  రెండు కాలిబాట మార్గాలు మూసివేత.


   

   

 • 20 Nov 2021 12:35 AM (IST)

  PM Modi spoke to CM Jagan

 • 20 Nov 2021 12:24 AM (IST)

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు

 • 19 Nov 2021 11:48 PM (IST)

  వర్షాలపై ఏపీ కేబినెట్

  అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వర్షాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆస్తులు, పంట నష్టం, రోడ్లు, విద్యుత్ సరఫరాపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన 14 బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 • 19 Nov 2021 11:45 PM (IST)

  అనంతపురం పోలీసుల రెస్క్యూ ఆపరేషన్

  అనంతపురం: పుట్టపర్తి సాయి నగర్ కాలనీ వాసులను సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు.

  చిత్రావతి నది వరద నీటి ఉధృతితో జలమయమైన పుట్టపర్తి సాయి నగర్ .

 • 19 Nov 2021 11:40 PM (IST)

  కడప జిల్లాలోని గండికోట, మైలవరం జలాశయాలకు వరదనీరు పోటెత్తింది.

  కడప జిల్లాలోని గండికోట, మైలవరం జలాశయాలకు వరదనీరు పోటెత్తింది. గండి కోట నుంచి మైలవరానికి లక్షన్నర క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.

  మైలవరం నుంచి పెన్నా నదికి లక్షన్నర క్యూసెక్కులు విడుదల చేశారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, చాపాడు, చెన్నూరులకు వరద ముప్పు పొంచి ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

   

 • 19 Nov 2021 11:38 PM (IST)

  చిక్కుకున్న యువకుడిని పోలీసులు రక్షించారు

  అనంతపురం జిల్లా శాసనకోట వద్ద పెన్నా నదిలో ఇద్దరు యువకులు చిక్కుకుపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుల్ని ఫైర్‌ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో కాపాడారు.

 • 19 Nov 2021 11:33 PM (IST)

  కడపలోని అన్ని ప్రాజెక్టుల వద్ద ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు

  కడప రాజంపేట ప్రాంతాలలో 33 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 1200 మందికి పునరావాస కేంద్రాలలో సహాయ కార్యక్రమాలు అందించడం జరుగుతోంది. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల వద్ద అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతొంది.

  జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలలో మరొక పది సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మైలవరం పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

  ఏదైనా అవసరమైతే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08562- 244437, 246344 కు కాని, ఆర్డీవో కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు, మండల కార్యాలయాలకు ఫోన్ చేసి సహాయం కోరవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.

 • 19 Nov 2021 11:30 PM (IST)

  దాదాపు 12 మంది వరదనీటిలో కొట్టుకు పోగా ఇప్పటి వరకు 8 మృతదేహాలు వెలికితీశారు

  భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 12 మంది వరదనీటిలో కొట్టుకు పోగా ఇప్పటి వరకు 8 మృతదేహాలు వెలికితీశారు. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి.

 • 19 Nov 2021 05:37 PM (IST)

  తిరుమల :భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన శ్రీవారి మెట్టు మార్గం.

 • 19 Nov 2021 05:37 PM (IST)

  అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది లో చిక్కుకున్న జెసిబి లో ఉన్న 11 మంది ని ఫైర్ సిబ్బంది హెలిక్యాప్టర్ సహాయంతో రక్షించారు.

 • 19 Nov 2021 05:18 PM (IST)

  వరద నీటిలో పుట్టపర్తి, అనంతపురం జిల్లా.

 • 19 Nov 2021 04:08 PM (IST)

  భారీ వరదలతో అతలాకుతలమవుతున్న తిరుపతి. నెట్ లో వీడీయోలు వైరల్

 • 19 Nov 2021 03:32 PM (IST)

  అనంతపురం జిల్లా, చిలమత్తూరు చెరువుకు వరద నీరు పెరగడంతో మరువా వద్ద నిలిచిపోయిన రాకపోకలు..

 • 19 Nov 2021 02:28 PM (IST)

  కడప జిల్లా నందలూరు మండలం, పాటూరు గ్రామంలో వరద నీరు పోటెత్తింది

  గ్రామం మొత్తం వరద నీటితో నిండిపోయింది. సహాయం కోసం గ్రామస్థులు ఎత్తైన భవనాలు ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

   

 • 19 Nov 2021 01:55 PM (IST)

  క‌డ‌ప జిల్లాలోనూ వ‌ర్ష‌బీభ‌త్సం - బ‌స్సులో ప్ర‌యాణీకుల ఆర్త‌నాదాలు

  క‌డ‌ప జిల్లా రాజంపేట‌లో వ‌ర‌ద ఉధృతిలో నిలిచిపోయిన బ‌స్సు. కాపాడిన అధికారులు.

   

 • 19 Nov 2021 01:05 PM (IST)

  కొట్టుకుపోయిన చెన్నై హైవే

  నెల్లూరు-చెన్నై రహదారి వరదనీటికి మరోసారి కొట్టుకుపోయింది. మనుబోలు ప్రాంతంలో హైవేపైకి వరదనీరు చేరడంతో రోడ్డు కొట్టుకునిపోగా.. ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాలు వెళ్తున్నాయి. రోడ్డుకి అటు ఇటు టూవీలర్స్ ని పోలీసులు ఆపేశారు. దీంతో వారు ఆందోళన చేస్తున్నారు. పెద్ద వాహనాలను మాత్రమే పంపిస్తున్నారు. పంబలేరు ఉధృతికి హైవే కకావికలం అయింది.

 • 19 Nov 2021 12:51 PM (IST)

  వైజాగ్‌కు మ‌రో గండం

  విశాఖపట్నం నగరంలో తెల్లవారినుంచి ఆగి, ఆగి వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు గంటల్లో నగరంలో వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాయుగుండం PULL-EFFECT వల్ల బంగాళాఖాతంలో ఏర్పడే మేఘాలు నేరుగా విశాఖ​-కాకినాడ బెల్ట్ లో పడనుంది. దీని వల్ల వర్షాలు విస్తారంగా కురిసే అవ్కాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రెండు గంటల్లో పెన్నా నది వరద ఉదృతి మరింత పెరగనుంది. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో రానున్న మూడు గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు.

 • 19 Nov 2021 12:48 PM (IST)

  చిత్రావతి బాలంసింగ్ రిజర్వాయర్ ప్రస్తుత పరిస్ధితి.

 • 19 Nov 2021 12:45 PM (IST)

  ఏపీలో వ‌ర్షాల‌పై చిరంజీవి ట్వీట్‌

  ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రజలకు ప్రతిఒక్కరు సాధ్యమైనంత వరకూ సాయం చేయాలని ఆయన కోరారు.కడప జిల్లా : రాజంపేట మండలంలోని రామాపురం వద్ద నీటిలో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు...బస్సు పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు...