Site icon HashtagU Telugu

Fish Hunting In Srisailm Dam: శ్రీశైలంలో అద్భుత దృశ్యాలు.. తెప్పల్లో చేపల వేటకు..

Fish Hunting In Srisailam

Fish Hunting In Srisailam

Srisalam Dam: శ్రీశైలం జలాశయానికి (Srisailam Dam) ఎగువ ప్రాంతాల నుండి వరద (Floating) నీరు తగ్గిపోయిన తరువాత, సోమవారం సాయంత్రం తొమ్మిది గేట్లను మూసివేయగా, స్థానిక మత్స్యకారులు ఉదయం చిన్న చిన్న పడవలలో చేపల వేటకు (Small Ships) బయలుదేరారు. గేట్లు మూసివేయడం వల్ల నీరు క్రమంగా తగ్గడం తో, మత్స్యకారులు (Fishermens) తమ వేట కోసం నదిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ అద్భుత దృశ్యాలను ఎవరో వీడియో (Viral Video) తీసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో, వందల సంఖ్యలో మత్స్యకారులు చిన్న పడవలలో చేపల వేటకు (Fish Hunt) వెళ్లుతున్నట్లుగా కనిపించారు ఈ అద్భుత దృశ్యం నెటిజన్లను (Netigens) చాలా మంత్రముగ్ధులను చేస్తోంది.

ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో (Dam) ఒకే గేటు నుండి నీటిని విడుదల చేస్తుండగా, మత్స్యకారులు చేపల (Fish) కోసం నదిలోకి వెళ్లడాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, కొంతమంది మత్స్యకారులు లైఫ్ జాకెట్లు, మరియు ఇతర ఎమర్జెన్సీ పరికరాలు (Emergency Equipments) లేకుండా వెళ్ళడం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . వీరంతా లింగాలగట్టు గ్రామానికి చెందిన వారు.. అధికారులు ఇచ్చిన వరద హెచ్చరికలను పట్టించుకోకుండా నదిలోకి వెళ్లినట్లు తెలియజేస్తున్నారు.