Site icon HashtagU Telugu

Women’s Day : ఆస్తి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన జగన్..మహిళాభ్యుదయం అంటున్నాడు

Jagan Womensday

Jagan Womensday

మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) తన ట్విట్టర్ ఖాతాలో మహిళల అభ్యున్నతి కోసం తాను చేసిన కృషిని గర్వంగా ప్రస్తావించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తన లక్ష్యమని, భవిష్యత్తులోనూ అదే దిశగా ముందుకు సాగుతానని తెలిపారు. అయితే ఆయన కుటుంబంలోని మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, కోర్టుల వరకు వెళ్లిన ఆస్తి వివాదాలు ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలను రేకెత్తిస్తున్నాయి.

తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన ఘనుడు

జగన్ మాటల్లో మహిళా సంక్షేమం ఎంతో ఉన్నప్పటికీ, ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల లతో ఉన్న సంబంధాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆస్తి వివాదంలో విజయమ్మను కోర్టుకు లాగడం, తన చెల్లికి పితృఆస్తి ఇచ్చేందుకు మొండి చేయి చూపించడం ఆ కుటుంబ విభేదాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. అంతేకాకుండా వైసీపీ సోషల్ మీడియా వర్గాలు షర్మిలపై చేసిన విమర్శలు మరింత దుమారం రేపాయి. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ మరోవైపు కుటుంబ మహిళలను వివాదాల్లోకి లాగడం ప్రజల్లో విమర్శలకు తావిచ్చింది.

వైఎస్ సునీతకు న్యాయం దక్కిందా?

వైఎస్ వివేకా హత్యపై వైఎస్ సునీత న్యాయం కోరగా, జగన్ ప్రభుత్వం ఏంచేసింది..? ఆమె తన తండ్రి హత్యకు సంబంధించి నిజాన్ని బయటపెట్టాలని కోరినా, దీనిపై స్పష్టమైన విచారణ జరిపేందుకు ఆసక్తి చూపలేదు. పైగా సునీతపైనే కేసులు బనాయించేందుకు ట్రై చేసారు. ఇంత చేసిన జగన్ నేడు మహిళా సాధికారత గురించి , మహిళా హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.

మహిళా దినోత్సవం రోజున మహిళలకు శుభాకాంక్షలు చెప్పడం, సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పడం కాదు ఇంటి మహిళలకు ఎంత న్యాయం చేసావు అనేది ముందు ఆలోచించుకో..ఆ తర్వాత సమాజంలోని మహిళల బాగోగుల కోసం ఆలోచించు. కుటుంబ మహిళలకే న్యాయం చేయలేని నువ్వు.. రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తారని ఎలా నమ్మాలి? మహిళల అభ్యున్నతి అంటే మాటలు కాదు, పనులు చెప్పాలి. ఒక కుటుంబంలోనే మహిళల బాధను గమనించలేకపోతే, రాష్ట్రంలోని మహిళల భద్రతను ఎలా కాపాడతారు? అంటూ యావత్ మహిళలు జగన్ పై విమర్శలు చేస్తున్నారు.

Exit mobile version