Site icon HashtagU Telugu

AP : చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మహిళలు క్యాండిల్ ర్యాలీ..పాల్గొన్న భువనేశ్వరి, బ్రాహ్మణి

Women Candle Rally Against Chandrababu Arrest

Women Candle Rally Against Chandrababu Arrest

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను స్కిల్ డెవలప్ మెంట్ కేసులో CID అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ను వైసీపీ సర్కార్ (YCP Govt) కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ చేసిందని..అసలు స్కామే జరగని దాంట్లో చంద్రబాబు ను జైల్లో పెట్టిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ..ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బంద్ , నిరసనలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు (TDP Leaders)..శనివారం సాయంత్రం రాజమండ్రి (Rajahmundry) లో మహిళలు క్యాండిల్ ర్యాలీ (Women Candle Rally Against Chandrababu Arrest ) చేపట్టారు. ఈ ర్యాలీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ క్యాండిల్‌ ర్యాలీ కొనసాగింది.

“చంద్రబాబు లాంటి విజనరీ నేతను అన్యాయంగా ..ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చేశారు. సంక్షేమం చేయడం నేరమా…? ఇపుడు ఉన్న ప్రభుత్వం యువతకు గంజాయి, లిక్కర్ తప్ప ఏమి ఇస్తుంది. మాకు మద్దతు తెలుపుతున్న జాతీయ నాయకులకు, ఐటీ ఉద్యోగులందరికి నా ధన్యవాదాలు. లోకేష్ ఒకచోట….మేము ఒకచోట తిరుగుతున్నాం.. నాలాంటి యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన తప్ప. లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారేమో…?. రిమాండ్ రిపోర్ట్ చదివితే ఎనిమిదేళ్ళ దేవన్ష్ అయిన అందులో ఏమి లేదని చెప్తాడు. ఇప్పుడు మేము ఒంటరి వాళ్ళం కాదు… మా వెనక టీడీపీ కుటుంబం ఉంది.. పాదయాత్ర నా ప్రోగ్రామ్ కాదు. లోకేష్ ప్రోగ్రాం.” అని నారా బ్రహ్మణి చెప్పుకొచ్చింది.

Read Also : AP : వర్మ మరింత దూకుడు..చం(ద్ర)మామ కథ అంటూ పోస్ట్..

ఇక గుంటూరులో సుమారు నాలుగైదు వేల మంది మహిళలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు కు మద్దతు తెలిపారు. ఇలా రోజు రోజుకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణ లోను పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు.

https://x.com/JaiTDP/status/1703042041947836723?