ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ (Pawan Kalyan Office) ముందు మహిళా ఆత్మహత్యాయత్నం (Woman Suicide Attempt) కలకలం రేపింది. రాజమండ్రిలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ తమ 1,200 గజాల భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని, పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. నిన్న సీఎం చంద్రబాబుని కలవాలని ఆమె, ఆమె భర్త ప్రయత్నించారు. కానీ పోలీసులు సీఎం చంద్రబాబుని కలవనివ్వకుండా అడ్డుకున్నారని ఆ దంపతులు వాపోయారు. ఈరోజు ఆ దంపతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు వచ్చామంటున్నారు. ఐతే.. పోలీసులు ఆ దంపతుల్ని క్యాంప్ ఆఫీస్ లోకి అనుమతించకపోవడం తో ఇలా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈరోజు నుండి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. ఈరోజు నుంచి 11 రోజులపాటు పవన్ ఈ దీక్ష పాటించనున్నారు. ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. కాగా, 2023 జూన్ లో పవన్ కల్యాణ్…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మ వారికి పూజలు చేసి…ఆ తర్వాత దీక్షకు దిగారు. ఇక ఇప్పుడు మరోసారి దీక్ష చేపట్టారు. దైవ భక్తి మెండుగా ఉన్న పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికలలో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాలలో విజయం సాధించింది.
Read Also : Jr Doctors Protest : తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె