ఏపీలో పోలీస్ వ్యవస్థ (AP Police) ఎలా మారిందో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష పార్టీల నేతలకు కాపలాకాయడం తప్ప ప్రజల బాగోగులు , వారి సమస్యలను పట్టించుకోవడమే మానేశారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన న్యాయం జరగడం లేదు. తాజాగా వైజాగ్ లో ఓ మహిళ తన గోడును పోలీసులు పట్టించుకోవడం లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసి నిరసన తెలిపింది.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి (Pendurthi)లో బాజీ కూడలి ప్రాంతానికి చెందిన గౌతమి పార్వతి ( 42) గత కొంతకాలంగా భర్త నుంచి వేరుపడి కూతురు, కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. ప్రస్తుతం వారు అద్దెకు ఉంటున్న ఇంటిని ఇంటి ఓనర్ అమ్మకానికి పెట్టానని ఇల్లు ఖాళీ చేయాలని కొంత కాలం క్రితం తెలపడంతో..ఆ ఇంటిని నేనే కొంటాను అని గౌతమి అతనికి ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చింది. ఆ తరువాత ఇంటి ఓనర్ మరోసారి తన మనుషులతో వచ్చి గౌతమి ఇంట్లో లేని సమయంలో ఆమెను బెదిరించి ఇంటిని ఖాళీ చేయాలని తెలిపాడు. దీంతో గౌతమి అడ్వాన్స్ తిరిగి ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్తానని తెలిపింది. అయినప్పటికీ కూడా ఇంటి ఓనర్ ఆమెను కుమార్తెను ఇంటి నుంచి బయటకు తోసేసి సామాను బయటపడేసే, ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో గౌతమి ఈ విషయం గురించి అదే రోజు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామని చెప్పి…ఎలాంటి విచారణ జరపడం లేదు. తమకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ చుట్లూ గౌతమి గత ఐదు రోజులుగా తిరుగుతూనే ఉన్నారు. కానీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకపోగా ఆమెకు సమాధానం కూడా చెప్పడం లేదు. దీంతో మంగళవారం రాత్రి పెందుర్తి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న గౌతమి పోలీసు స్టేషన్ గేటుకు తాళం (Police Station Locked) వేసింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై అపరాజిత, ఆమెను తీసుకుని వారు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. దీంతో ఇంటి ఓనర్ ని ఆమెకు తాళాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ వారు ఆమెనే తప్పుడు కేసులతో మమ్మల్ని వేధిస్తుందని ఆరోపించారు.
ఇళ్లు ఖాళీ చేయాలని చెబుతున్నప్పటికీ ఆమె వినిపించుకోవడం లేదని వారు తెలిపారు. ఈ క్రమంలో సీఐ వారికి సర్ది చెబుతుండగా ఆయనకు ఒత్తిడి పెరిగి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇంటి ఓనర్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. బాధిత గౌతమీ మాత్రం తమకు న్యాయం చేయాలనీ , తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతుంది.
Read Also : PM Modi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, దీపావళి బోనస్