Vizag : విశాఖలో దారుణం..మహిళను అతి కిరాతకంగా హత్య చేసారు

గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురు బాలాజీ గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న గాయత్రీ రాధా (45).. గత మూడు రోజులుగా ఆమె హెల్త్‌ బాగాలేదు. ఈ క్రమంలో ఆమె స్నేహితురాలు కల్పనా

Published By: HashtagU Telugu Desk
Woman Found Dead At House

Woman Found Dead At House

విశాఖ (Vizag) లో మరో దారుణం జరిగింది. ఇటీవల ఏపీ (AP)లో వరుస మహిళల హత్యలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఒంటరి మహిళలనే కాక ముసలి వారిని సైతం డబ్బుకోసం హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వైజాగ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అతి కిరాతకంగా వివస్త్రను చేసి చంపేశారు.

గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురు బాలాజీ గార్డెన్స్‌(Balaji Gardens)లో నివాసం ఉంటున్న గాయత్రీ రాధా (Gayatri Radha) (45).. గత మూడు రోజులుగా ఆమె హెల్త్‌ బాగాలేదు. ఈ క్రమంలో ఆమె స్నేహితురాలు కల్పనా (Kalpana)..గాయత్రీ బాగోగులు చేసుకుంటుంది. రాత్రి పలుమార్లు గాయత్రికి ఫోన్‌ చేసిన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ..కల్పిన ఆమెను చూసేందుకు ఆమె రూమ్ కు వెళ్ళింది. అయితే, గాయత్రి రూమ్‌ అంత చికటిగా ఉండడంతో లైట్ వేసి చూడగా.. గాయత్రి రక్తపు మడుగులలో, శరీరంపై ఏ మాత్రం దుస్తులు లేకుండా విగితాజీవిగా కనిపించడంతో షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో గాయత్రి భర్త తన పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి దగ్గరకు వెళ్లాడు. భర్త లేని సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. అసలు గాయత్రికి ఏమైంది? గాయత్రి ఎవరు హత్య చేసారు..? అనేది దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రీ హత్య తో ఆ ప్రాంతం అంత షాక్ లో ఉంది.

Read Also : Women Cricket – Gold : మహిళా క్రికెట్ లో ఇండియాకు గోల్డ్.. ఆసియా గేమ్స్ లో దూకుడు

  Last Updated: 25 Sep 2023, 04:02 PM IST