Social Media Trolling : ఓ నిండు ప్రాణం బలి.. అనాథలైన ముక్కుపచ్చలారని పిల్లలు

  • Written By:
  • Updated On - March 11, 2024 / 10:22 PM IST

సోషల్ మీడియా ట్రోలింగ్ (Social Media Trolling) కు మరో నిండు ప్రాణం బలైంది (Full of life )..ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. నిద్ర లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అంత సోషల్ మీడియా తో గడిపేస్తున్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏమి జరిగిన క్షణాల్లో అందరికి చేరుతుంటాయి. ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారు కూడా రోజు రోజుకు ఎక్కువైపోయారు. తమకు నచ్చని వారిపై ఇష్టాను రీతిగా ట్రోల్స్ చేస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తుంటారు. అలా సామాన్యుల నుంచి సెలబ్రీటిల వరకు ఎంతో మంది ట్రోల్స్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు. కొందరు అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తున్నారు.

ట్రోల్స్ అనేవి చేయొచ్చు..అది ఎప్పటివరకు అవతలి వ్యక్తి సంతోష పడేవరకు..అంతే కానీ ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత ఉండకూడదు. తాజాగా తెనాలిలోని ఇస్లాం పేట కు చెందిన గీతాంజలి దేవి (Geetanjali Devi) (29) గత నాల్గు రోజులుగా ఆమెపై జరుగుతున్న ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముక్కుపచ్చలారని.. ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి లేని బిడ్డలయ్యారు. ఇది సంతోషమేనా..? ఓ తల్లి చనిపోవడం..ఇద్దరు పసిపిల్లలు అనాధలవడం మీ ట్రోల్స్ కు వ్యూస్ పెంచుతాయా..? ఇలా చేయడం వల్ల ఏమి వచ్చింది.. ? మీ కడుపు చల్లారిందా..? ఎవరి కోసం మీరు ఎందుకు హంతకుల్లా మారుతున్నారు..? ఈ పాపం మీ పిల్లలకు , మీ కుటుంబానికి తగలదా..? ఏంచేసింది ఆ తల్లి..తనకు నచ్చిన పార్టీ కి జై కొట్టింది..అంతమాత్రాన మీరు అంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా..? ఆ తల్లి మరణం మీకు శాపం కదా..? ఆ పిల్లల ఉసురు మీకు తగలదా..?

We’re now on WhatsApp. Click to Join.

అభిమానం ఉండాలి అది ఎంతవరకు..అవతలి వ్యక్తి బాధపడనంత వరకే..అంతేకాని అభిమానం పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఏలాభం…? మీరు అభిమానించే నేతలు బాగానే ఉంటారు..? ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు దూషించుకుంటారు…ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకరికారు దావతులు చేసుకుంటారు..మాట్లాడుకుంటారు. కానీ మధ్య లో బాధపడేది..నష్టపోయింది మనమే. ఈరోజు మీ ట్రోల్స్ వల్ల ఓ తల్లి చనిపోయింది..దానికి ఏ సమాధానం చెపుతారు. సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గరి నుండి ప్రతి ఒక్కరు సెలబ్రెటీ అయ్యారు. వ్యూస్ కోసం , డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు..ఏమైనా చేస్తున్నారు. ముఖ్యంగా ట్రోల్స్ , మీమ్స్ అంటూ అవతలి వ్యక్తి మనోభావాలను దెబ్బ తీస్తూ..చివరకు ప్రాణం తీసుకునేలా చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అదే పనిగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల మీరు సంతోషపడచ్చు..కానీ మీ సంతోషం..అవతలి వ్యక్తి ని ఎంత బాధకు గురి చేస్తాయో ఒక్కసారైనా ఆలోచించారా..? ఇప్పుడు ఓ నిండు ప్రాణం బలైంది..దీనికి ఏమంటారు. ఇకనైనా ట్రోల్స్ చేయడం మానేసి ఓ మంచి పనికొచ్చేలా ప్రవర్తించాడని కోరుకుంటున్నాం.

ఇక ట్రోల్స్ కు బలైన గీతాంజలి విషయానికి వస్తే..తెనాలిలోని ఇస్లాం పేటకు చెందిన గీతాంజలి దేవి (29) ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటారు. అయితే సొంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. దీంతో ఆమె తన సొంతింటి కల నెరవేరిందని సంబరపడుతూ..తన సంతోషాన్ని మీడియా కు వ్యక్తం చేసింది. అంతే దీనిపై కొంతమంది విపరీతమైన ట్రోల్స్ చేసారు. ఈ ట్రోల్స్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య కు పాల్పడింది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చావుతో పోరాడి చివరకు ఈరోజు చనిపోయింది. ఈమె మరణం తో ఆ ఇద్దరు బిడ్డలు తల్లిలేని పిల్లలు అయ్యారు. ఈ ఘటన తో ఆ ప్రాంతమే కాదు రెండు తెలుగు రాష్టాల ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. #JusticeForGeethanjali #WeStandWithGeethanjali అనే యాష్ ట్యాగ్ లతో ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

Read Also : Telangana: బిడ్డా.. గుర్తుపెట్టుకో మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే: సీఎం రేవంత్