Andhra Pradesh: శ్రీశైలంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

శ్రీశైలం చెక్‌పోస్టు సమీపంలోని ఓ ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు పట్టుకున్నారు

Andhra Pradesh: శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంలో మద్యం , సిగరెట్లు , ఇతర మత్తు పదార్థాల విక్రయాలు నిషేధించబడ్డాయి . ఏళ్ల తరబడి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం చెక్‌పోస్టు సమీపంలోని ఓ ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు పట్టుకున్నారు . కొన్నాళ్లుగా వీరు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ చెక్‌పోస్టు నుంచి మద్యం కొనుగోలు చేసి శ్రీశైలం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు .

తెలంగాణ మద్యాన్ని ఏపీలో విక్రయిస్తున్న మహిళ నుంచి 166 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో కొద్దిరోజులుగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో తెలంగాణ మద్యం పట్టుబడడం విశేషం. మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శ్రీశైలం సీఐ ప్రసాదరావు వెల్లడించారు.

మహా పుణ్య క్షేత్రంలో మద్యం , మాంసాహారం కూడా నిషిద్ధమని స్పష్టం చేశారు . నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆలయ పవిత్రతను కాపాడాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో 8 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం