రాజకీయాన్ని, వ్యాపారాన్ని వేర్వేరుగా చూడలేం. బిజినెస్ తరహాలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నికల సమయంలో జిమ్మిక్కులు (Winning Sketch)అనేకం. తాజాగా జరిగిన గుజరాత్, యూపీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్లే చేసిన బిజినెస్ గేమ్ ఆ పార్టీకి ఎనలేని ఫలితాలను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఫార్ములా (formula) ను ఏపీ, తెలంగాణ సీఎంలు అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.
కనీసం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని టాక్. అయినప్పటికీ కేసీఆర్ మౌనంగా ఉన్నారు. అలాగే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద బాహాటంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కనీసం 70 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని వినికిడి. కొందరు బయటపడినప్పటికీ చాలా మంది బయటపడకుండా నెట్టుకొస్తున్నారట. ఎన్నికల సమయంలో పార్టీని వీడాలని ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటూ పక్క పార్టీల్లో కర్చీఫ్ లు వేసి పెడుతున్నారు. ఇవన్నీ ఇద్దరు సీఎంలకు తెలియని విషయాలు కాదు. అందుకే, వాళ్లు యూపీ, గుజరాత్ ఫార్ములాకు (Winning Sketch) పదును పెడుతున్నారని తెలుస్తోంది.
యూపీ, గుజరాత్ ఫార్ములాకు (Winning Sketch)
యూపీ, గుజరాత్ ఎన్నికల్లో రెబల్స్ కు బీజేపీ పెట్టుబడి పెట్టిందట. ఎన్నికల్లో మరింత దూకుడుగా వ్యవహరించడానికి ఊతం ఇచ్చిందని వినికిడి. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తి వాదులను ఎంపిక చేసుకుని వాళ్లకు ఎన్నికల ఖర్చును సమకూర్చడం ద్వారా అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యారని అంచనా. అందుకే, ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి బీజేపీ వచ్చింది. గుజరాత్ లో సొంత పార్టీ రెబల్స్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తివాదులను ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కకావికలం చేయగలిగారు. ఫలితంగా ఐదోసారి అనూహ్యంగా బీజేపీ గుజరాత్ ఫలితాలను సాధించింది. సేమ్ ఇలాంటి ఫార్ములాను. యూపీలోనూ అమలు చేసి అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో అదే ఫార్ములా (formula) ను కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారని వినికిడి.
Also Read : KCR and Jagan: కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ ఫిట్టింగ్
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడానికి జనసేన ఏపీలో బలపడాలి. అంతేకాదు, కొత్త పార్టీలు కూడా బలంగా రావాలి. ఇప్పుడిప్పుడే జనసేన బలపడినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీలోని అసంతృప్తివాదులు ప్రధాన ప్రతిపక్షం వైపు వెళ్లకుండా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీఆర్ఎస్, జనసేన ఎక్కువగా చీల్చుకోవడానికి అవకాశం ఉంది. అవసరమైతే, పెట్టుబడి పెట్టడానికి కూడా వైసీపీ వెనుకాడకుండా ముందుకు వెళుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే, తెలంగాణలోని ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోవడానికి వైఎస్సార్ తెలంగాణ, బీఎస్పీ పార్టీలు వచ్చేశాయి. ఆ రెండు పార్టీలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జగన్మోహన్ రెడ్డి కనుసన్నన్నలో ఉంటాయని సర్వత్రా వినిపిస్తోంది. వాళ్ల ద్వారా కేసీఆర్ కు సహకారం అందించడానికి జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి పావులు కదుపుతున్నారని టాక్. ప్రతిగా బీఆర్ఎస్ రూపంలో వైసీపీకి పరోక్ష అండ ఇవ్వడానికి ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా గుజరాత్, యూపీలో బీజేపీ అధిరంలోకి వచ్చిన విధంగా ఏపీ, తెలంగాణాల్లో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి తిరిగి రావాలని స్కెచ్ వేశాయని వినిపిస్తోంది.
ఇద్దరూ క్విడ్ ప్రో కో పద్ధతి ద్వారా
తటస్థులు టీడీపీ వైపు మళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రస్ట్ గా ఉండే వాళ్లను గమనిస్తున్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరూ వెళ్లకుండా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బీజేపీ బ లపడినట్టు కనిపిస్తోంది. కానీ, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా బలహీనంగా ఉంది .ఆ విషయం కేసీఆర్ కు తెలుసు. ఆ పార్టీ మరింత బలపడకుండా అవసరమైతే, జగన్మోహన్ రెడ్డిని దింపడానికి కేసీఆర్ రెడీ అయ్యారని బీఆర్ఎస్ వర్గాల్లోని టాక్. ప్రతిగా కేసీఆర్ ను ఏపీలో వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్దమయ్యారని తెలుస్తోంది. మొత్తం మీద ఇద్దరూ క్విడ్ ప్రో కో పద్ధతి ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని బ్రదర్స్ గా ఉండే సీఎంలు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే, ఖమ్మం వేదికగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనవరి ఒకటో తేదీన రెబల్ తెరపైకి వచ్చారని తెలుస్తోంది. స్వతహాగా ఆయన వైసీపీ లీడర్. పైగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇటీవల రెండు సార్లు ఇటీవల జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో కలిశారు.
Also Read : Political Bussiness : `కాపు `కోటలో రియల్ `తోట`! ఏపీలో బీఆర్ఎస్ దందా!
రియల్ ఎస్టేట్ చేసే తోట చంద్రశేఖర్ హైదరాబాద్ కేంద్రంగా లావాదేవీలు పెత్తు ఎత్తున ఉంటాయి. ఆయన జనసేనకు బలమైన ఆర్థిక సహాయకారి. అందుకే ఆయనపై బీఆర్ఎస్ ఆపరేషన్ చేసింది. జనసేన మరింత బలపకుండా జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగా ఇలాంటి ఆపరేషన్లు మరిన్ని బీఆర్ఎస్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద గుజరాత్, యూపీ ఫార్ములను ఏదో ఒక రూపంలో అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ సిద్దమయ్యారని రాజకీయ వర్గాల్లోని టాక్. ఎంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఈక్వేషన్ ఫలిస్తుందో చూడాలి.