Site icon HashtagU Telugu

Thota Trimurthulu – YSRCP: తోట త్రిమూర్తులుకు సీటు ఇస్తారా ? వేటు వేస్తారా ?

Thota Trimurthulu Ysrcp

Thota Trimurthulu Ysrcp

Thota Trimurthulu – YSRCP: 1996 డిసెంబర్‌ 29న  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించిన కేసులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ఆయనకు  18 నెలల జైలు శిక్ష , రూ.2 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఏపీ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేసింది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు.. ఈ ఎన్నికల్లో  మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు.  కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఏం చేస్తుంది ? తోట త్రిమూర్తులకు(Thota Trimurthulu – YSRCP) మండపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదా ? ఎమ్మెల్సీ అనంతబాబులాగే.. తోట త్రిమూర్తులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join

అధికార పార్టీ నీడలో..

తోట త్రిమూర్తులుపై చాలానే కేసులు ఉన్నాయి. అమానుషంగా దళితులకు  శిరోముండనం చేయించిన వ్యవహారంలో 1997లో ద్రాక్షారామ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటన 1996 డిసెంబర్‌ 29న  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో  చోటుచేసుకుంది.  తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించడంతో పాటు ఐదుగుర్ని హింసించారు.  అప్పట్లో ఈ సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కోర్టుల విచారణకు తరుచుగా హాజరవుతూనే ఉన్నారు. గత ఏడేళ్లుగా   విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. 28 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఎట్టకేలకు మంగళవారం రోజు కోర్టు తీర్పు వెలువడింది. తోట త్రిమూర్తులు గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా రామచంద్రపురంలో ఓడిపోయాక వైకాపాలో చేరారు. 2021 నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

దూడల మారు బేరగాడిగా ప్రస్థానం మొదలుపెట్టి..

పెద్దగా చదువుకోని తోట త్రిమూర్తులు మొదట్లో అమలాపురం ప్రాంతంలో దూడల మారు బేరగాడిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత రామచంద్రపురం చేరుకుని.. 1994లో స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి సెటిల్‌మెంట్లు, భూ దందాలు, పంచాయితీలు చేసి డబ్బులు సంపాదించారు. కాజులూరు మండలం పల్లెపాలెంలో 32 ఎకరాలు ఇలాగే రాయించుకున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై 2022 నవంబరులో జనసేన నేత లీలాకృష్ణ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కానీ, తోట త్రిమూర్తులు అధికార వైఎస్సార్ సీపీలో ఉండటంతో  ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూలు పోలీసుస్టేషన్‌లో 2005లో ఒక కేసు నమోదైంది.కాకినాడ జిల్లా సర్పవరం పోలీసుస్టేషన్‌లో 2006లో ఒక కేసు నమోదైంది.

Also Read : Kishan Reddy Vs MIM – Congress : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓడించేందుకు సీఎం రేవంత్ బిగ్ స్కెచ్!