Nara Lokesh: విశాఖ ను ఐటి హబ్ , తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తా: మంత్రి నారా లోకేశ్

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 11:41 PM IST

Nara Lokesh: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎలక్ట్రానిక్స్ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను ఆరా తీశాను. త్వరలోనే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకువస్తాము. విశాఖ ను ఐటి హబ్ గాను, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచిన అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను కోరా’’ అని లోకేశ్ అన్నారు.

‘‘ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల వివరాలు ఇవ్వాలని కోరాను. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీలపై నివేదిక ఇవ్వాలని అడిగాను. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల వివరాలు, ఎప్ సెట్ లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజి ఏమేరకు ఇవ్వాలి, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏమేరకు ఉండాలనే విషయమై కూడా నోట్ సమర్పించాలని కోరాను. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడం పై కూడా రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలని,యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పడిపోవడానికి గల కారణాలు అధ్యయనం తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ ఇవ్వమని కోరాను. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై కూడా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించాను’’ అని మంత్రి లోకేశ్ అన్నారు.