ఆ ఇద్దరూ.. వైసీపీని ఒంటరిని చేస్తారా..?

రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శాశ్వాత శత్రువులు అంటూ అసలు ఉండరు. నిన్న ప్రత్యర్థులుగా ఇవాళ శత్రువులుగా మారొచ్చు. ఇవాళ శత్రువులుగా ఉన్నవాళ్లు మిత్రులుగా మారొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయాల్లో వైరి వర్గాలు, మిత్రపక్షాలుగా.. మిత్ర పక్షాలు వైరి వర్గాలు మారడంలో ఏమాత్రం సందేహాలు ఉండవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చిత్రాన్ని చూస్తే పై వాఖ్యలే గుర్తుకువస్తాయేమో..

  • Written By:
  • Updated On - October 2, 2021 / 10:57 AM IST

రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శాశ్వాత శత్రువులు అంటూ అసలు ఉండరు. నిన్న ప్రత్యర్థులుగా ఇవాళ శత్రువులుగా మారొచ్చు. ఇవాళ శత్రువులుగా ఉన్నవాళ్లు మిత్రులుగా మారొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయాల్లో వైరి వర్గాలు, మిత్రపక్షాలుగా.. మిత్ర పక్షాలు వైరి వర్గాలు మారడంలో ఏమాత్రం సందేహాలు ఉండవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చిత్రాన్ని చూస్తే పై వాఖ్యలే గుర్తుకువస్తాయేమో..

చాలాకాలం తర్వాత జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా మారారు. ఆంధ్రప్రదేశ్ లోజరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన 100కు పై సీట్లు సాధించి తమ సత్తా ఏంటో చాటింది. అంతేకాదు గతంలో పోల్చితే జనసేనకు ఓటుబ్యాంకు కూడా భారీగానే పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 4.67 శాతం ఓట్లు సాధించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పక తప్పదు. కొన్ని చోట్లా ఒంటరి పోరు చేసి పరిషత్ స్థానాలు సాధిస్తే.. మరికొన్ని చోట్లా టీడీపీ సాయంతో ఇంకొన్ని స్థానాలు కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల పుణ్యానా జనసేన లో కొత్త జోష్ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు మంచి కిక్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కీలకంగా మారారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై ఇండ్రస్టీ పెద్దలు సైలంట్ ఉన్నా.. పవన్ మాత్రం బహిరంగంగానే విమర్శించారు. ప్రైవేట్ వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ పెద్దల పెత్తనమేంటీ? అని తనదైన స్టయిల్ లో వైపీసీపై విరుచుకుపడ్డారు. పవన్ వాఖ్యలకు బదులుగా వైసీపీ శ్రేణులే అంతే ధీటుగా బదులిచ్చాయి. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వైసీపీని విధానాలను ఎండగడుతుంటే.. తాజాగా పవన్ కళ్యాణ్ దూకుడు పెంచి వైసీపీ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 2024లో వైసీపీని కొట్టాలంటే తాను ఒక్కడితోనే కాదని పవన్ భావిస్తున్నారట. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే టీడీపీతోనూ కలిసిపోయేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో దోస్తీ కట్టిన పవన్, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో చేతులు కలిపేందుకు సైతం వెనుకాడబోరని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు నారా చంద్రబాబునాయుడుకు, ఇటు పవన్ కల్యాణ్ కు ఉమ్మడి శత్రువైనా వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.