Vote Transfer : ఏపీలో కూటమికి ‘ఓట్ ట్రాన్స్‌ఫర్‌’ జరుగుతుందా ?

Vote Transfer :  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో  టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఈసారి అత్యంత కీలకమైన అంశం.. ‘ఓట్ల బదిలీ’ !!

  • Written By:
  • Publish Date - May 11, 2024 / 08:20 AM IST

Vote Transfer :  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో  టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఈసారి అత్యంత కీలకమైన అంశం.. ‘ఓట్ల బదిలీ’ !! దీనిపై ఎన్నికలకు ఏడాది ముందు నుంచే గట్టిగా మాట్లాడిన నాయకుడు ‘జనసేనాని’ పవన్ కళ్యాణ్. ‘‘ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో ఓట్ల చీలిక జరగనివ్వను.. వైఎస్సార్ సీపీని గెలవనివ్వను’’ అంటూ ఆయన తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల సమయానికి అదే దిశగా పరిణామాలు మారాయి. బీజేపీ-జనసేనతో టీడీపీ జతకట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా సీట్ల పంపకాలు చేసుకున్నాయి. అభ్యర్థులను బరిలోకి దింపాయి. ప్రచారంలోనూ ఐకమత్యంతో దూసుకుపోతున్నాయి. ఇక మే 13న పోలింగ్ వేళ జరగాల్సిందల్లా ఒక్కటే.. ఓట్ల బదిలీ(Vote Transfer)!!

We’re now on WhatsApp. Click to Join

టీడీపీ అభ్యర్థులకు బీజేపీ, జనసేన ఓట్లు బదిలీ  కావాలి. బీజేపీ అభ్యర్థులకు టీడీపీ, జనసేన ఓట్లు బదిలీ కావాలి. జనసేన అభ్యర్థులకు టీడీపీ, బీజేపీ ఓట్లు బదిలీ కావాలి. ఇది జరగాలంటే క్షేత్రస్థాయిలో మూడు పార్టీల క్యాడర్ మధ్య బలమైన సమన్వయం జరగాలి. ఆ దిశగా కూటమికి సంబంధించిన ఉమ్మడి యంత్రాంగంతో ఎక్కడికక్కడ రాష్ట్రవ్యాప్తంగా కసరత్తు జరగాలి. అప్పుడే ఓట్ల బదిలీ ఈజీగా జరుగుతుంది. ఓట్ల బదిలీ అనేది కేవలం ప్రచారంతో జరిగిపోయే అంశం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనికోసం క్షేత్రస్థాయిలో టీమ్ వర్క్ అవసరమని చెబుతున్నారు.

Also Read :Telangana Ministers : తెలంగాణ మంత్రులకు ‘లోక్‌సభ’ పరీక్ష.. ఎందుకంటే ?

  • ఏపీలో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 6 లోక్ సభ స్థానాల్లో, 10 అసెంబ్లీ స్థానాల్లో  పోటీ చేస్తోంది.
  • జనసేన 2 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.
  • టీడీపీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది.
  • ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఓట్ల బదిలీ కీలకం. కోస్తా జిల్లాల్లో ఓట్ల బదిలీ ఎంత పర్ ఫెక్ట్ గా జరిగితే కూటమికి అంత గొప్ప విజయాలు వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముమ్మర ప్రచారం చేశారు.
  • కూటమిలో ఏ గుర్తుకు ఓటు వేసినా తమ అభిమాన పార్టీకి వేసినట్లే అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడంలో కూటమి సక్సెస్ అయిందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.
  • ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల పాటు ఏపీలో మూడు సభలు, ఓ రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి నడుస్తున్నాయన్న గట్టి నమ్మకాన్ని ఆయన ఓటర్లలో కలిగించారు.
  • ఏపీలోని ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామ స్థాయిలో క్యాడర్ ఉన్న పార్టీ టీడీపీనే. అందుకే ఓట్ల బదిలీలో కీలక పాత్రను టీడీపీయే పోషించాల్సి ఉంటుంది.
  • జనసేన, బీజేపీలకు క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేదు. అందుకే ఆ రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నచోట కూడా ఓట్ల బదిలీ కోసం టీడీపీయే కీలక వ్యవహరించాల్సి ఉంటుంది.

Also Read :Samyukta Menon : టాలీవుడ్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ నటించాలంటే కష్టం అంటూ..!