దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఏపీ ఎన్నికలు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మొదలు పోలింగ్ ముగిసినా అక్కడ మాత్రం వేడి తగ్గట్లేదు. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఏపీలో ఎక్కడ ఎవరిని అడిగినా టీడీపీ కూటమిదే గెలుపు అనే సమాధానం వస్తుంది. ఇంకా చెప్పాలంటే.. టీడీపీ అభ్యర్థులు గెలుపుపై కాకుండా.. ఏకంగా టీడీపీ అభ్యర్థుల మెజారిటీపై బెట్టింగిలకు దిగుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కావస్తోంది.. ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే. అయితే.. ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో పరిణామాలు ఏంటని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని రెండు మండలాల్లో ప్రధాన పార్టీల ఆధిక్యత స్పష్టంగా కనిపించడంతో నాయకులు, కార్యకర్తలు లెక్కల్లో నిమగ్నమై ఉన్నారు. ఎవరి గెలుపుకైనా మార్కాపురంలో మెజారిటీ కీలకం కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చారిత్రాత్మకంగా చూస్తే 1994 ఎన్నికలు మినహా మార్కాపురం పట్టణ ప్రజలు టీడీపీకి నిలకడగా విజయాన్ని అందించారు. గతంలో జరిగిన ముక్కోణపు పోటీల్లో కూడా మార్కాపురంలో టీడీపీకి గట్టి మద్దతు లభించింది. ఆవిర్భావం నుంచి ఇక్కడ మరే పార్టీ కూడా ఆధిక్యత సాధించిన దాఖలాలు లేకుండా టీడీపీదే ఆధిపత్యం. వివిధ ఎన్నికల ద్వారా పట్టణంలో టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉంది. 2014 ఎన్నికల్లో మార్కాపురం సెగ్మెంట్‌లో టీడీపీ ఓడిపోయినప్పటికీ పట్టణంలో 3,500 ఓట్ల మెజారిటీ సాధించింది.
2019 ఎన్నికల్లో జగన్ ఓవరాల్‌గా విజయం సాధించినప్పటికీ టీడీపీకి కంచుకోట అయిన మార్కాపురం పట్టణం మాత్రం చెక్కుచెదరలేదు. టీడీపీని వీడి జనసేన తరపున పోటీ చేసిన ఇమ్మడి కాశీనాద్ ఓట్లు చీల్చినప్పటికీ పట్టణంలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి 1450 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన అన్నా రాంబాబు పోటీ చేస్తున్నారు.
పట్టణంలో తొలిసారి మెజారిటీ సాధిస్తామని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆర్య వైశ్య సామాజికవర్గం మొదటి నుంచి టీడీపీకి మద్దతివ్వడంతోపాటు సవాళ్లు ఎదురైన సమయంలోనూ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. మార్కాపురం నియోజకవర్గంలోని 24 నుంచి 81 వరకు ఉన్న బూత్‌లను అర్బన్ బూత్‌లుగా పరిగణిస్తూ ఈ బూత్‌లపై కూడా కొందరు ఆర్య వైశ్య సామాజికవర్గ ఓటర్లు పందేలు కాస్తున్నారు.
Read Also : AP Politics : ప్రశాంత్ కిషోర్ అంచనాలు వైసీపీలో గుబులు పెంచుతున్నాయా..?