Kumki Elephants : ఆ బాధ్యత నేను తీసుకుంటా – హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Kumki Elephants : కుంకి ఏనుగుల అవసరాలను తీర్చడానికి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంచాం. వాటికి ఎలాంటి హాని జరిగినా నన్నే బాధ్యుడిగా భావించండి

Published By: HashtagU Telugu Desk
Kumki Elephants Pawan

Kumki Elephants Pawan

కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన కుంకి ఏనుగుల(Kumki Elephants)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)కు ధన్యవాదాలు తెలుపుతూ… కుంకి ఏనుగుల విషయంలో పూర్తిస్థాయి బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. “వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను” అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

“ఏపీలో ఇప్పటికే ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. కుంకి ఏనుగుల అవసరాలను తీర్చడానికి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంచాం. వాటికి ఎలాంటి హాని జరిగినా నన్నే బాధ్యుడిగా భావించండి” అంటూ తాను వ్యక్తిగతంగా ఈ విషయంపై బాధ్యత వహిస్తానని తెలియజేశారు. ఇది వన్యప్రాణుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

ఇక ఈ చర్యలు రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రతీకగా నిలుస్తాయని పవన్ అభిప్రాయపడ్డారు. “ఇలాంటి సహకారం భవిష్యత్తులో మరింత బలపడాలి. వన్యప్రాణుల సంరక్షణపై రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలి” అని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరియు ఆయన చూపిన చొరవకు పర్యావరణ ప్రేమికులు, సమాజం అన్ని వర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  Last Updated: 21 May 2025, 04:13 PM IST