Posani Bail Petition : ఆ రోజైన పోసానికి బెయిల్ వస్తుందో..?

Posani Bail Petition : గుంటూరు పోలీస్ స్టేషన్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని, తనకు బెయిల్ మంజూరు చేయాలని CID కోర్టులో పిటిషన్ వేశారు

Published By: HashtagU Telugu Desk
Posani Adoni Police Station

Posani Adoni Police Station

సినీ నటుడు, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ (Posani Arrest) అయ్యి 21 రోజులు కావొస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 16 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు పోలీస్ స్టేషన్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని, తనకు బెయిల్ మంజూరు చేయాలని CID కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు విచారణ జరిగినప్పటికీ, తుది తీర్పును ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరవుతుందా లేదా అనే ఉత్కంఠ మరింత పెరిగింది.

Jagran Film Festival : ముంబైలో ముగిసిన 12వ జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్

అతని గత వ్యాఖ్యలు, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుంటే, న్యాయస్థానం వెనుకడుగు వేసే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మార్ఫింగ్ ఫోటోలు ప్రదర్శించడం, రాజకీయ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. అంతేకాదు గుంటూరు జడ్జి ముందు తనకు బెయిల్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఘటన కూడా వివాదాస్పదంగా మారింది. ఇదే సమయంలో మరో వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పోసాని 9 లక్షలు తీసుకుని మోసం చేశాడని మీడియా ముందు ఆరోపించడం, ఆయనపై ఉన్న సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేసింది.

Stonecraft Group : శంషాబాద్‌ వద్ద AQI మానిటరింగ్ స్టేషన్‌

ఇన్ని వివాదాల్లో ఉన్నప్పటికీ పోసాని చేసిన వ్యాఖ్యలు గత ప్రవర్తన ప్రజల్లో అతనిపై జాలి కలగనివ్వడం లేదు. గతంలో మీడియా సమావేశాల్లో ఆయన చిన్న పిల్లలను కూడా వదలకుండా చేసిన అసభ్య వ్యాఖ్యలు నెటిజెన్స్ లో ఆగ్రహాన్ని రేపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల తర్వాత రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్తానని ప్రకటించిన పోసాని, తన అరెస్టు అంచున ఉన్న విషయాన్ని ముందే ఊహించినట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం అతనిని వదిలిపెట్టేలా లేదు. పోసాని బెయిల్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  Last Updated: 19 Mar 2025, 07:54 PM IST