AP : జనసేన – టీడీపీ రెండిటిని పవన్ కల్యాణే చూసుకుంటాడా..?

ఈ ప్రకటన సమయంలో బాలయ్యకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. పవన్ ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారారు.

  • Written By:
  • Updated On - September 15, 2023 / 12:45 AM IST

రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ (janasena -TDP alliance) కలిసి పోటీ చేయబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. ఈ ప్రకటన కొంతమందిలో నిరాశ కలిగీస్తే..మరికొందరిలో సంతోషం నింపుతుంది. నిరాశ కలిగే వారిలో బాలయ్య అభిమానులు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే..

మూడు ఏళ్లుగా రాష్ట్రంలో టీడీపీ జోరు లేదు..ఇప్పుడిప్పుడే సైకిల్ (TDP) స్పీడ్ అందుకుంది..ఇక సైకిల్ కు తిరుగులేదు..ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటు వెళ్లడమే అని పార్టీ శ్రేణులు..ప్రజలు భావించారు..కానీ సడెన్ గా అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఒక్కసారిగా సైకిల్ కు బ్రేకులు పడేలా చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ను జగన్ సర్కార్ (Jagan Govt) జైల్లో వేసి తన కోరిక తీర్చుకుంది. అక్కడితో ఆగడం లేదు..ఏ దారి నుండి కూడా చంద్రబాబు బయటకు రానివ్వకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఈ కేసు ఆ కేసు అనే కాదు గతంలో మూలనపడ్డ కేసులన్నీ బయటకు తీస్తూ వస్తుంది. దీంతో చంద్రబాబు బయటకు వస్తాడో..రాడో..అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.

మరో నాల్గు,ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ టీడీపీ ఫై ప్రజల్లో ఆశలు మొదలయ్యాయి. మరోసారి బాబు కు ఓటు వేసి గెలిపించాలని భావిస్తున్నారు. ఈ టైం లో బాబు ను జైల్లో వేసి..ప్రజల ఆశల ఫై నీళ్లు చల్లింది వైసీపీ. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలన్నీ మానేశారు. కేవలం చంద్రబాబు బయటకు వస్తారా..రారా..? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి..? పార్టీని ముందుండి నడిపించే బాద్యత ఎవరు తీసుకుంటారు..? లోకేష్ వల్ల అవుతుందా..? మిగతా నేతలకు పార్టీ బాధ్యత ఇస్తే అంతే సంగతి..? మరి ఏంచేస్తారు..ఏంచేయాలి అనేదానిపైనే మాట్లాడుకోవడం..చర్చలు జరపడం స్టార్ట్ చేసారు.

ఇదే క్రమంలో బాలయ్య పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత నుంచి పార్టీ వ్యవహారాల్లోనూ.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ వచ్చారు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో బాలకృష్ణ.. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తామని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో అరాచకం కొనసాగుతోందని, గతంలో ఆయన జైలుకు వెళ్లొచ్చారని, ఇప్పుడు అందరినీ కక్ష పూరితంగా జైలుకు పంపిస్తున్నారని బాలయ్య ఫైర్ అయ్యారు.

Read Also : Chandrababu Arrest : రోజా సంబరాలపై పవన్ కామెంట్స్ ..

జగన్ ఆటలు సాగనివ్వనని కూడా హెచ్చరించారు..అంతే కాదు బాబు మాదిరే టీడీపీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయడం తో ఆయన అభిమానులు , కొంతమంది టీడీపీ శ్రేణులు.. టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా మారేందుకు బాలయ్య సిద్దమయ్యారా అనే అభిప్రాయంలోకి వచ్చారు. కానీ ఈరోజు బాలయ్య, లోకేశ్ ఇద్దరూ పవన్ తో జైలులో చంద్రబాబు తో ములాఖత్ కు ప్లాన్ చేసారు. ములాఖత్ వెంటనే ఇప్పటి వరకు అధికారికం కాని పొత్తును అధికారికం చేసారు పవన్. బీజేపీ కలిసి వస్తుందని తమ అంచనాగా చెబుతూ..రావాలని పవన్ అప్పీల్ చేసారు. పవన్ పొత్తు ప్రకటన చేసి వెంటనే వెళ్లిపోయారు. ఈ ప్రకటన సమయంలో బాలయ్యకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. పవన్ ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారారు. ఫలితంగా బాలకృష్ణ కు పార్టీ లో ప్రాధాన్యత ఉంటుందా..ఉండదా అనే అనుమానంలో ఆయన అభిమానులు ఉన్నారు.

ఇక జనసేన శ్రేణులు , పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇక పవన్ టీడీపీ , జనసేన రెండు పార్టీల బాధ్యత చేసుకోవాల్సిందే అని..పవన్ ప్రకటన తోనే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని..ఇప్పుడు పవన్ అవసరం టీడీపీ కి చాల ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి పవన్ పొత్తు ఫై క్లారిటీ వైసీపీ క్లి చెమటలు పట్టిస్తుంది.