Nagababu : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవాళ ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధిపతి పవన్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు సమాచారాన్ని అందించారు. దీంతో కూటమి సర్కారులోని జనసేన పార్టీ నుంచి నాగబాబు(Nagababu)కు కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం మరింత బలపడింది. ఇప్పటికే జనసేన నుంచి ఏపీ మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిలో పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్‌లు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే, జనసేన నుంచి పూర్తిగా కాపులకే ప్రాతినిధ్యం దక్కుతోందనే టాక్ జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. తన సోదరుడికి మంత్రి పదవిని పొందేందుకు ప్రయత్నిస్తారా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :Mars In 30 Days: 30 రోజుల్లోనే అంగారకుడిపైకి.. ఇదిగో ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్
టీడీపీలో టఫ్ ఫైట్
ఏపీలో త్వరలో భర్తీకానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం భారీ పోటీ నెలకొంది. ప్రత్యేకించి టీడీపీలో టఫ్ ఫైట్ నెలకొంది. ఆశావహులంతా టీడీపీ పెద్దలను కలుస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగియనున్న బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్‌బాబులు సైతం తాము ఇంకా రేసులోనే ఉన్నామని వాదిస్తున్నారు.
Also Read :Singer Kalpana: వెంటిలేటర్ పై సింగర్ కల్పనా.. హాస్పిటల్ కు చేరుకున్న గాయని సునీత!
ఆశావహులు వీరే..
ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న నేతల్లో మాజీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, మాజీ ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎం సైఫుల్లా తనయుడు జియావుల్లా, విశాఖకు చెందిన మహమ్మద్ నజీర్, జంగా కృష్ణమూర్తి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం పోటీలో ఉన్నారు.