వైసీపీ నుండి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి (Vijayasaireddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)తో లొంగిపోయారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) తాజా ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు జగన్‌కు మద్దతుగా నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రత్యర్థి పక్షానికి మద్దతు ఇస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లోకి టీడీపీ నేత టీడీ జనార్ధన్, అనంతరం విజయసాయిరెడ్డి వెళ్లిన దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీనిపై వర్గాల్లో సందేహాలు మరింత పెరుగుతున్నాయి. నిజంగా విజయసాయిరెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారా అన్నదే ప్రశ్నగా మారింది.
Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్
అయితే వీరి ఇంటి సందర్శన వెనక రాజకీయ కుట్రలు లేవని, అది కేవలం గాయపడిన ఓ రాజకీయ నేతను పరామర్శించడమే అని కొందరు స్పష్టం చేస్తున్నారు. మొదటగా టీడీ జనార్దన్, అనంతరం విజయసాయిరెడ్డి వెళ్లిన సన్నివేశాన్ని బిగ్ స్కామ్‌లా ప్రదర్శించడం తప్పని వాదన కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వారు నిజంగా రహస్య చర్చలు జరపాలనుకుంటే.. అందరి కంటపడేలా వెళ్లే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రచారమే కాని, వాస్తవం కాదన్న అభిప్రాయం వస్తోంది.
అయితే వైఎస్ జగన్‌కు మాత్రం ఇది ఓ సంకేతం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా జగన్‌పై పగపట్టకపోయినా, ఆయనను పదే పదే అవమానపరచడం వల్ల ఆ పగ తలెత్తే ప్రమాదం ఉందని అంచనా. జగన్ రాజకీయ ప్రయాణంలోని అసలు నిజాలు, అక్రమాస్తుల కేసులనుంచి బయటపడే మార్గాలు, ఆంతర్యాలు విజయసాయిరెడ్డికే బాగా తెలుసన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఆయన అదే మర్మాలను బయటపెడతానంటే.. జగన్ భవిష్యత్ నిజంగానే భయంకరమైన మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైసీపీకి లభిస్తున్న ఈ సంకేతాలను తక్కువగా అంచనా వేయకూడదు.