Site icon HashtagU Telugu

Jagan : జగన్ అసెంబ్లీకి వెళ్తారా..? టీడీపీ నేతల ప్రశ్నలకు సమాదానాలు చెప్పగలరా..?

Jagan Assembli

Jagan Assembli

జగన్ (Jagan) పరిస్థితి చూసి పాపం అనుకునే వారు కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి శభాష్ అనిపించుకున్న జగన్..ఈసారి 11 కే పరిమితం అయ్యారు. 175 కు 175 సాదిస్తామంటూ గొప్పగా చెప్పుకొచ్చిన ఆ పార్టీ నేతలు , మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు. మొత్తం మంత్రుల్లో ఒక్క పెద్ది రెడ్డి తప్ప మిగతా వారంతా ఓటమి చెందారు. నిత్యం మీడియా ముందు సవాళ్లు విసరడం , బూతులు మాట్లాడడం చేసే మంత్రులకు ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ది చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి అనేది అర్ధం కావడం లేదు. అధికారంలో ఉన్నాం కదా అన్నట్లు చెప్పలేని తప్పులు చేసారు. ఆ తప్పులకు శిక్ష విధించకుండా కూటమి ఊరుకోదు..లెక్కలతో సహా బదులు తీర్చుకుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

మరి జగన్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చ గా మారింది. తన 11 మందితో కలిసి అసెంబ్లీకి వెళ్తారా అనే చర్చ మొదలైంది. కూటమి నేతల ప్రశ్నలకు అసెంబ్లీ లో సమాదానాలు చెపుతారా..? అసెంబ్లీలో కూటమి సభ్యుల దూకుడును ఎదుర్కొనేందుకు జగన్ కు ఈ బలం సరిపోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాభవంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో హేళన చేసారు. ఇప్పటికి వాటిని టీడీపీ నేతలు, శ్రేణులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా పరుష పదజాలంతో దూషించారు. కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు. దీంతో ఇప్పుడు అలాంటి రియాక్షన్ కూటమి నుంచి ఎదురైతే జగన్ వాటన్నింటిని తట్టుకొని నిలబడుతారా అనేది అందరి మదిలను తొలచి వేస్తోన్న ప్రశ్న. అధికార పక్షం నుంచి వచ్చే కౌంటర్లను తిప్పికొట్టేందుకు జగన్ పక్కన దూకుడుగా వ్యవహరించే నేతలు కూడా ఈసారి లేకపోవడం మరో మైనస్. వీటన్నింటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అసలు జగన్ వెళ్తారా..? అని అంత ఆసక్తి కనపరుస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!!

Read Also : RK Roja : రోజా ఓటమి.. వైసీపీ నేతల సంబరం