Site icon HashtagU Telugu

District Tours : సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తా : వైఎస్‌ జగన్‌

YS Jagan Comments On AP Govt

YS Jagan Comments On AP Govt

District Tours : సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించకున్నట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. అంతేకాక..ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు జగన్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతుల కోసం ధర్నా చేశామని ఈ నెల 27న కరెంట్ బిల్లులపై మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు.

మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు. చంద్రబాబు పాలన బాదుడే బాదుడులా ఉందని. సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదని.. అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోందని చెప్పారు. 2027లో జమిలి ఎన్నికలు అంటున్నారని.. దీంతో నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోందని జగన్ అన్నారు. మనం మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని మంచి పనులను మన ప్రభుత్వ హయాంలో చేశామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని జగన్‌ చెప్పారు.

జిల్లాల పర్యటనలో నేతలతో నేరుగా కార్యకర్తలతోనే జగన్ సమావేశం కానున్నారు.. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటనలో ప్రతి బుధ, గురువారం కార్యకర్తలతోనే జగన్ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి వారి నుంచే స్వయంగా సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. అలాగే రోజుకు మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ కానున్నట్లు జగన్ తెలిపారు.

Read Also: TTD : 1,40,000 వైకుంఠ ద్వార దర్శన టికెట్లు 18 నిమిషాల్లో ఫుల్‌..