ఏపీ (2024 AP Assembly Elections)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. కేసీఆర్ (KCR) సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు , అభివృద్ధి ఇవేవి కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. మార్పు రావాల్సిందే అని ప్రజలు ఏక కంఠంతో కాంగ్రెస్ (Congress) ను గెలిపించారు. ఇక ఏపీలో కూడా ఇదే జరగబోతున్నట్లు అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో జగన్(AP CM Jagan) లో సైతం భయం మొదలైంది..అందుకే ముందస్తు జాగ్రత్తగా అభ్యర్థుల మార్పులు చేయడం స్టార్ట్ చేశారు.
అభ్యర్థుల మార్పు వల్ల పార్టీ కి ఉపయోగం ఉంటుందని భావిస్తే..ప్రజలు మాత్రం జగన్ ఓడిపోతామనే భయంతోనే మార్పులు మొదలుపెట్టాడని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే ఈసారి టికెట్స్ కూడా ప్రస్తుతం ఉన్న వారికీ కాకుండా అంత కొత్త వారికే ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యాడట. ఆ మేరకు కార్యాచరణ కూడా మొదలుపెట్టాడట. ప్రస్తుతం ఉన్న మంత్రులకు కూడా ఈసారి టికెట్ కష్టమే అని తేల్చి చెప్పాడని వినికిడి. అందుకే ఉన్న వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటీ ఆ మేరకు వ్యవహారాలు మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క టీడీపీ-జనసేన (TDP-Janasena) సైతం వైసీపీ నేతలకు ఆహ్వానాలు అందించడం మొదలుపెట్టింది. గురువారం టీడీపీ , జనసేన కార్యాలయాల్లో జోరుగా చేరికలు జరిగాయి. వైసీపీ నుండి చాలామంది మాజీ మంత్రులు, కీలక నేతలు ఇరు పార్టీలలో చేరారు. నిన్న మీడియా సమావేశం లో చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ.. జగన్ 151 మందిని మార్చినా ప్రయోజనం లేదని ..ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో తమ పార్టీలోకి రావాలనకునేవారికి ఓ రకమైన సందేశం పంపారు. అన్నీ పరిశీలించి.. సర్వేలు .. ప్రజాభిప్రాయం సేకరించి టిక్కెట్లు ఇస్తామన్నారు. అంటే.. వస్తామన్న వారికి టీడీపీ లో టిక్కెట్ ఆప్షన్ ఉన్నట్లే అని బాబు చెప్పకనే చెప్పాడు. వైసీపీ నుంచి ఎవరైనా వస్తే పరిశీలిస్తామని కూడా బాబు హామీ ఇచ్చారు. బాబు హామీ ఇస్తే టికెట్ ఖరారు అని ఫిక్స్ అవొచ్చు. అందుకే చాలామంది వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే టీడీపీ తో జనసేన పొత్తు ఉండడం తో..జనసేన లో బలమైన నేతలు..పోటీ చేసే నేతలు తక్కువగా ఉండడం..ప్రజల్లోను జనసేన కు మద్దతు పెరడంతో మరికొంతమంది జనసేన వైపు చూస్తున్నారట. జనసేన లో చేరితే టికెట్ గ్యారెంటీ అని ఫిక్స్ అవుతూ ఆ మేరకు వారి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారట. ఇలా మొత్తం మీద జనవరి నాటికీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున టీడీపీ – జనసేన పార్టీలోకి చేరడం ఖాయం అని తెలుస్తుంది.
Read Also : Kadiyam Srihari: గవర్నర్ ప్రసంగం లో కొత్తదనం లేదు, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టు ఉంది: కడియం శ్రీహరి