Site icon HashtagU Telugu

Raghurama : చంద్రబాబు పేరు ఇక సూర్యబాబుగా మారుతుందేమో : రఘురామ

Will Chandrababu name change to Suryababu from now on: Raghurama

Will Chandrababu name change to Suryababu from now on: Raghurama

Raghurama : శాస‌న‌స‌భ‌లో విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి చంద్రబాబు మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. సూర్యశక్తిని ఒడిసిపట్టి ఇంధన అవసరాలను తీర్చేలా సీఎం చంద్రబాబు మంచి ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన శాసన సభ్యులంతా పనిచేస్తాం. సూర్యశక్తిని ఒడిసి పడుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ఇక “సూర్యబాబుగా” మారుతుందేమో అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Read Also: Holi : హోలి ఉత్సవం.. మీ డివైసులను రక్షించుకునే మార్గాలు !

దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మీరేదో నాకు కరెంటు షాక్‌ ఇవ్వాలనుకుంటున్నట్టున్నారు అనడంతో సభలో నవ్వులు విరబూశాయి. ఇక ఈ నెల 18న స‌భ్యులంతా త‌ప్ప‌కుండా స‌భ‌కు హాజ‌రు కావాల‌ని, ఆ రోజు సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌వుతారు క‌నుక గ్రూప్ ఫొటో తీసుకుంటే అదొక గుర్తుగా ఉంటుంద‌ని డిప్యూటీ స్పీక‌ర్ పేర్కొన్నారు. అంతేకాక..శనివారం వెంకటపాలెంలో జరిగే శ్రీనివాస కల్యాణంలోనూ సభ్యులంతా పాల్గొనాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కోరారు.

Read Also: MLC Elections : చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు : నాగబాబు