Site icon HashtagU Telugu

Chandrababu : ఎన్డీఏలో చంద్రబాబే కింగ్ మేకర్ అవుతారా ?

Chandrababu

Chandrababu

Chandrababu : ఈ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ సర్కారే వస్తే.. ఏం జరుగుతుంది ? చంద్రబాబు చక్రం తిప్పుతారా ? ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తారా ? అంటే కొందరు సెఫాలజిస్టులు ఔననే సమాధానమే చెబుతున్నారు. దక్షిణాదిలో ఎన్డీఏ కూటమికి బలాన్ని ఇచ్చే అతిపెద్ద రాజకీయ శక్తిగా టీడీపీ నిలుస్తుందని వారు అంటున్నారు. ఏపీలో టీడీపీ -బీజేపీ – జనసేన కూటమి గెలిస్తే.. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయని లెక్కలు వేస్తున్నారు. ఏపీలో వైఎస్సార్ సీపీ ఓడిపోతుందని ఇప్పటికే రాజకీయ పండితుడు ప్రశాంత్ కిశోర్  జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. వెరసి.. మళ్లీ ఎన్డీఏకు లైన్ క్లియర్ అవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈసారి ఉత్తరాదిలోని చాలా సీట్లను బీజేపీ కోల్పోబోతోందని ప్రముఖ ఎన్నికల నిపుణులు యోగేంద్రయాదవ్, రుచిర్ శర్మ, సీఓటర్ యశ్వంత్ దేశ్ ముఖ్, ఇతర సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఈసారి బిహార్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో బీజేపీ సీట్లకు గండిపడే రిస్క్ ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది స్థానాల్లో మూడు తప్ప అన్నీ గెలిచారు. ఈ సారి కొన్ని సీట్లు కోల్పోవడం ఖాయం. బిహార్, మహారాష్ట్రల్లో బీజేపీ పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఎలా చూసినా గత ఎన్నికలతో పోలిస్తే కనీసం 60 సిట్టింగ్ సీట్లు కోల్పోయే రిస్క్ బీజేపీకి ఉంది. ఈవిధంగా ఏర్పడుతున్న  లోటును టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు అవలీలగా పూడుస్తాయని.. అవే ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే పరిస్థితి వస్తే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు టాప్ ప్రయారిటీ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read : Temperatures : తెలుగు రాష్ట్రాల్లో మరో 2 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు !

ఒకవేళ ఎన్డీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లుగా మారితే.. ఆ లిస్టులో టీడీపీ తప్పకుండా ఉంటుందని అంటున్నారు. ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ కానీ.. నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ కానీ ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి లేదని తెలుస్తోంది. వాటి కంటే టీడీపీకే ఎక్కువ లోక్‌సభ సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కేంద్రంలో టీడీపీకి(Chandrababu) ప్రాధాన్యత పెరుగుతుంది.

Also Read :Remal Cyclone : బెంగాల్‌లో తీరం దాటిన రెమాల్ తుఫాను.. ఏమైందంటే..

Exit mobile version