Minister Nani: మంత్రి ‘కొడాలి’కి కౌంట్ డౌన్?

మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని పదవికి గండం తప్పదా? సొంత పార్టీ వాళ్ళే కాసినో వివాదంలో తెలివిగా ఇరికించారా? ఆయన హైదరాబాద్ లో ఉండగా ఇదంతా ఎందుకు జరిగింది? వైసీపీ రెబల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ చెబుతున్న దాన్లో నిజం ఉందా?

  • Written By:
  • Updated On - January 22, 2022 / 09:26 PM IST

మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని పదవికి గండం తప్పదా? సొంత పార్టీ వాళ్ళే కాసినో వివాదంలో తెలివిగా ఇరికించారా? ఆయన హైదరాబాద్ లో ఉండగా ఇదంతా ఎందుకు జరిగింది? వైసీపీ రెబల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ చెబుతున్న దాన్లో నిజం ఉందా? నాని తో పొలిటికల్ అవసరం ముగిసిందా? కాపులకు గుడివాడ ను వైసీపీ సెట్ చేస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందేహాలను త్రిబుల్ ఆర్ ఢీల్లీ నుంచి రేకేత్తించాడు. రాజకీయ గేమ్ లో నాని బకారా కాబోతున్నాడా? అంటే..రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగడానికి అవకాశం ఉంది.
ఇటీవల దాకా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇలాగే ఒంటికాలుపై టీడీపీ మీద లేచాడు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శీలంపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. మొదట వాటి గురించి పెద్దగా టీడీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా అసెంబ్లీ వేదికగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవే అనుచిత మాటలను రిపీట్ చేసాడు. అప్పుడు టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఆ లోపు రెండేళ్ళ పాటు టీడీపీని చంద్రబాబును ఇష్టానుసారంగా వంశీ బూతులు తిట్టాడు. అసెంబ్లీలో సమయం చూసి వంశీని ఇరికించేశారు.

రాజకీయంగా చీకటి కనిపించే వరకు ఆయన్ను వాడుకున్నారు. నందమూరి కుటుంబం మొత్తం బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చే వరకు ఆయన్ను వైసీపీ వాడేసుకుంది. ఖమ్మం జిల్లా నుంచి కమ్మ సంఘం వాయిస్ తీవ్రంగా వినిపించే వరకు వెళ్ళింది ఆ ఎపిసోడ్. ఇక ఆ రోజు నుంచి దాదాపుగా ఆయన వెనుక ఏమి జరుగుతుందో ఆలోచించాడు. సీన్ కట్ చేస్తే క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుంచి దాదాపుగా మళ్ళీ మీడియా లో కనిపించటం లేదు . ఒక వేళ కనిపించినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు.
ఇక ఇప్పుడు మంత్రి కొడాలి ఎపిసోడ్ చివరకు వచ్చినట్టు తెలుస్తోంది. వంగవీటి రాధ ‘రెక్కి’ వ్యవహారం నుంచి వైసీపీ మూడో కన్ను వేసినట్టు ఆ పార్టీ వర్గాల వినికిడి. ‘రెక్కి’ అంశంపై పోలీస్ విచారణ జరిగింది. కానీ, పోలీసులు మాత్రం ఎలాంటి రెక్కి లేదని తేల్చారు. రాధ మాత్రం ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు. పైగా ఆ రెక్కేకి ముందు రాధ గుడివాడ వెళ్ళాడు. అక్కడ నుంచి ఈసారి పోటీ చేయడానికి గ్రౌండ్ తయారు చేసుకుంటున్నాడు అని ఆ రోజున మీడియా ఫోకస్ చేసింది. వెంటనే రెక్కి వ్యవహారం తెరపైకి వచ్చింది. దాని వెనుక గుణదల బ్యాచ్ ఉందని రాధ అనుచరుల అనుమానం. ఏమి జరిగింది అనేది పోలీసులకు తెలుసు . అందుకే రాధ నుంచి ఎలాంటి సమాచారం తీసుకోలేదు. పైగా ఆయనకు భద్రత కల్పించాలని జగన్ సర్కార్ ఆదేశించింది.

ఆరోజున రాజకీయంగా వైసీపీకి ఆ ఎపిసోడ్ ఎంతో కొంత కాపు సామాజిక వర్గం రూపంలో మైనస్ అయిందని ఆ పార్టీ అంచనా.
ఇక ఇప్పుడు కాసినో ఎపిసోడ్ పార్టీ కి మచ్చ తీసుకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ లోని కొందరు లెక్కిస్తున్నారు. గతంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ రూపంలో టీడీపి కి ఇదే ప్రాంతం నుంచి నష్టం జరిగింది. ఇప్పుడు దాదాపుగా అలాంటి ఎపిసోడ్ నడుస్తుంది. పై గా కొడాలి వాడుతున్న భాష సీఎం జగన్ కు డామేజ్ చేస్తుందని ఆయన కోటరీలోని కొందరు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బూతుల మంత్రిగా ఆయన్ను టీడీపీ చిత్రీకరించింది. తాజా ఎపిసోడ్ తో కాసినో మంత్రిగా ప్రచారం చేసింది.

ఫలితంగా దీని ప్రభావం సీఎం జగన్ మీద ఉంటుంది. సో..నష్ట నివారణ కోసం వైసీపీ అడుగులు వేస్తోందని టాక్. వీలున్నంత వరకు రాజకీయంగా సామాజిక గేమ్ కొడాలి చేత ఆడించామని అంచనాకు వచ్చారట. ఇప్పటికిప్పుడు బర్తరఫ్ చేయకుండా నిదానంగా పక్కన పెట్టాలని ప్లాన్ జరుగుతుందని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరగ బోతుంది. ఆ సమయానికి గ్రౌండ్ క్లియర్ చేసి తప్పించాలని స్కెచ్ రెడి అయిందని ప్రచారం జరుగుతుంది. అందుకు సంకేతంగా కొడాలి మీడియాలో ని మాటలను చూస్తే అర్థం అవుతుంది.
సాధారణంగా ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబును అనుచితంగా మాట్లాడతాడు. ఈసారి స్టైల్ మర్చాడు. ఒక విభాగం మీడియాకు వన్ టూ వన్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పైగా ఒక్కో మీడియాలో లో ఒక్కో రేంజ్ లో రెచ్చిపోయాడు. సాక్షి ఛానెల్ ఇంటర్వ్యూలో కొంచం తగ్గి మాటలు ఉపయోగించాడు. ఇవన్నీ గమనిస్తే జగన్ పరోక్షంగా నైనా హెచ్చరించాడా? అనే అనుమానం కలుగుతోంది. అందుకే , మీడియాకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడా అనే అనుమానం రాకమానదు. కరోన తో బాధ పడుతున్న చంద్రబాబు కోలుకోవాలి అని జగన్ ట్వీట్ చేసాడు. కానీ చావడానికి చంద్రబాబు గుడివాడ రావాలి అని నాని సవాల్ చేస్తున్నాడు. ఇదంతా కొంచం సునిశితంగా ఆలోచించాల్సిన సమయం. ఏదో తేడా కొడుతున్నట్టు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి.

అవి నిజం అయితే త్వరలో వల్లభనేని తరహాలో..కొడాలి మౌనంగా సైడ్ కావడం ఖాయం. సో..రాజకీయాల్లో ఎప్పుడు ఏదయినా జరగడానికి ఆస్కారం ఉంది. గతంలో చాలా పరిణామాలు రాత్రికి రాత్రి జరిగిన సంఘటనలు చూసాం . పైగా ఇప్పుడు రెబెల్ త్రిబుల్ ఆర్ తాడేపల్లి కేంద్రంగా ఏమి జరుగుతుందో ..డైలీ రచ్చ చేస్తున్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే కొడాలి మంత్రి పదవికి గండం కు కౌంట్ డౌన్ ప్రారంభం అయినట్టే!