Site icon HashtagU Telugu

Brother Anil: జగన్ కు ‘కొత్త పార్టీ’జలక్

Anil With Ys Sharmila Imresizer

Anil With Ys Sharmila Imresizer

ఏపీలో కొత్త పార్టీ పెట్టడానికి బ్రదర్ అనిల్ సిద్దం అవుతున్నాడు. అందుకోసం వివిధ సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించాడు. ఆ విషయం ఒక్కసారిగా వెలుగు చూసింది.
రెండు గంటలకు పైగా జరిగిన సమావేశం జరిగిందని తెలుస్తోంది. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో అనిల్ ఉన్నాడని ఆ సమావేశంలో పాల్గొన్న కొందరు చెప్తున్నారు. జగన్, వైసిపి వ్యతిరేక వర్గాల తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాడు. రాజకీయ అంశాలపై అధ్యయనం చేయడానికి ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలిసిన విషయం విదితమే. ఆ రోజు ఇద్దరు కలిసి సుదీర్ఘ మీటింగ్ అయ్యారు. కొత్త పార్టీ గురించి ఆ రోజే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వైఎస్ కుటుంబానికి క్లోజ్ గా ఉండే ఉండవల్లి బ్రదర్ అనిల్ కు రాజకీయ బోధ చేసాడు. ఆ తరువాత జరుగుతున్న మీటింగ్ వివిధ సంఘాలతో కావున కొత్త పార్టీ ప్రకటన త్వరలో ఉంటుందని సమాచారం . వైస్సార్ ఏపీ పార్టీ గా వచ్చే ఛాన్స్ ఉందని షర్మిల కోటలో ని టాక్.
శొంఠి నాగరాజు… బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బ్రదర్ అనిల్ మీటింగ్ గురించి చెప్పాడు. జగన్ గెలుపుకు మేము ఎంతో కృషి చేశాం. కానీ ,ఆశించిన సహకారం జగన్ నుంచి లేదని వెల్లడించాడు.
2019 ఎన్నికల సమయంలో కూడా అనిల్ మాతో సమావేశం పెట్టి జగన్ కోసం పని చేయాలని చెప్పాడని పేర్కొన్నాడు. జగన్ సిఎం అయ్యాక రెండేళ్లుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అసంతృప్తి ని వెళ్లగక్కాడు. ఆ విషయాన్నీ సోమవారం అనిల్ తో జరిగిన సమావేశంలో చెప్పినట్టు వెల్లడించాడు.
త్వరలోనే కొత్త పార్టీ కింద పని చేద్దామని అనిల్ వెలుబుచ్చాడని నాగరాజు చెప్పాడు. కొత్త పార్టీ వివరాలను బ్రదర్ అనిల్ కొద్దీ రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే ఏపీ కి తరచు బ్రదర్ వెళుతున్నాడు. తొలుత చర్చ్ మీటింగ్స్ అని లైట్ గా చెప్పాడు. రాజకీయాలతో సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసాడు. రొండో సారి ఉండవల్లి భేటీతో కొంత వరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేరుగా సమావేశాలు పెట్టుకోవటం చూస్తే ఏపీలో బ్రదర్ అనిల్, షర్మిల దంపతులు కొత్త పార్టీ పెట్టుకొనే అవకాశాలు లేకపోలేదు. అయితే ఆ పార్టీ ని ఎవరూ లీడ్ చేస్తారు? దాని లక్ష్యం ఏమిటి అనేది? చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో వైస్సార్ తెలంగాణ పార్టీ ఉంది. మలివిడత పాదయాత్రకు అవుతోంది. ఇలాంటి పరిణామాలు నడుమ కొత్త పార్టీ ఎలా అనేది పెద్ద ప్రశ్న. దానికి సమీప భవిష్యత్తులో సమాధానం వస్తుందని బ్రదర్ సమావేశంలో పాల్గొన్న నాగరాజు అంటున్నాడు. సో ..నిప్పులేనిది పొగ రాని సమేతగా ఏమి లేకుండా కొత్త పార్టీ టాక్ రాదు. !