గతంలో కంటే రాష్ట్రంలో సైకిల్ (TDP) స్పీడ్ అందుకుంది..ఇక సైకిల్ కు తిరుగులేదు..ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటు వెళ్లడమే అని పార్టీ శ్రేణులు..ప్రజలు భావించారు..కానీ సైకిల్ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఒక్కసారిగా సైకిల్ కు బ్రేకులు పడేలా చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ను జగన్ సర్కార్ (Jagan Govt) జైల్లో వేసి తన కోరిక తీర్చుకుంది. అక్కడితో ఆగడం లేదు..ఏ దారి నుండి కూడా చంద్రబాబు బయటకు రానివ్వకుండా అడ్డుకట్ట వేస్తుంది. ఈ కేసు ఆ కేసు అనే కాదు గతంలో మూలనపడ్డ కేసులన్నీ బయటకు తీస్తూ వస్తున్నారు. దీంతో చంద్రబాబు బయటకు వస్తాడో..రాడో..అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.
మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ టీడీపీ ఫై ప్రజల్లో ఆశలు మొదలయ్యాయి. మరోసారి బాబు కు ఓటు వేసి గెలిపించాలని భావిస్తున్నారు. ఈ టైం లో బాబు ను జైల్లో వేసి..ప్రజల ఆశల ఫై నీళ్లు చల్లింది వైసీపీ. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలన్నీ మానేశారు. కేవలం చంద్రబాబు బయటకు వస్తారా..రారా..? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి..? పార్టీని ముందుండి నడిపించే బాద్యత ఎవరు తీసుకుంటారు..? లోకేష్ వల్ల అవుతుందా..? మిగతా నేతలకు పార్టీ బాధ్యత ఇస్తే అంతే సంగతి..? మరి ఏంచేస్తారు..ఏంచేయాలి అనేదానిపైనే చర్చిస్తున్నారు.
తాజా పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు స్థానంలో నందమూరి బాలకృష్ణ (balakrishna) ఆ బాద్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాబు అరెస్ట్ అయిన తరువాత నుంచి పార్టీ వ్యవహారాల్లోనూ.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలలోనూ బాలకృష్ణ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో అరాచకం కొనసాగుతోందని, గతంలో ఆయన జైలుకు వెళ్లొచ్చారని, ఇప్పుడు అందరినీ కక్ష పూరితంగా జైలుకు పంపిస్తున్నారని బాలయ్య ఫైర్ అయ్యారు.
Read Also: Alphabet Lays Off: 12,000 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్
జగన్ ఆటలు సాగనివ్వనని కూడా హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా మారేందుకు సిద్దమయ్యారా అనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది. చంద్రబాబు కూర్చునే ఛైర్లోనే కూర్చోవడం.. బాబు మాదిరే టీడీపీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయడంలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు బాలయ్య. ఇక వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాలకు గుడ్ బై చెబుతాని బాబు ప్రకటించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే బాలయ్య ట్రై చేస్తున్నారని కొంతమంది భావిస్తున్నారు. మరోపక్క తండ్రి బాధ్యతను తీసుకోవాలని నారా లోకేష్ కూడా భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం చంద్రబాబు అరెస్ట్ కావడం తో రాష్ట్రంలో జనసేన ను మరింత స్పీడ్ చేయాలనీ చూస్తున్నాడు. ఇలా ఎవరికీ వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనప్పటికి బాబు అరెస్ట్ కావడం..టీడీపీ పార్టీ ని గందరగోళంలో పడేసింది.