Site icon HashtagU Telugu

AP 3 Capitals in Supreme Court: 3 పై 1న “సుప్రీం” డైలమా

Ys Jagan Amaravati Lesson

Ys Jagan Amaravati Lesson

నవంబర్ ఒకటో తేదీకి ఏపీకి విడదీయరాని సంబంధం ఉంది. ఆ రోజును మరిపించే ప్రయత్నం చంద్రబాబు చేస్తే జగన్ మోహన్ రెడ్డి మాత్రం నవంబర్ ఒకటో తేదీని ఆర్బాటంగా చేస్తున్నారు. ఇది కూడా పొలిటికల్ లాజిక్ పాయింట్ కింద వైసీపీ తీసుకుంది. మరో వారం రోజుల్లో నవంబర్ ఫస్ట్ వస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈ రోజుకు ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. 1956న నవంబర్ 1న ఉమ్మడి ఏపీ అవతరణ జరిగింది. విడిపోయిన తరువాత జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే జరుపుకుంటారు. కానీ, ఏపీకి చంద్రబాబు సీయం గా ఉన్న టైం లో ఆవిర్భావ రోజు అంటూ లేదు. జగన్ వచ్చాక నవంబర్ ఫస్ట్ నే డిక్లేర్ చేశారు. అంటే ఏపీకి సంబంధించి ఎంతో విలువ గౌరవం ఆ రోజునకు ఉంది. యాధృచ్చికంగా అదే రోజున ఏపీకి రాజధాని అమరావతి భవిష్యత్తుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఈసారి కీలక విచారణ జరగనుంది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ లలిత్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన ధర్మానసం అమరావతి రాజధాని విషయంలో సమగ్రమైన విచారణ జరపనుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల కోసం సెప్టెంబర్ లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేసింది. కొన్ని కీలకమైన అంశాలను ప్రభుత్వం తన పిటిషన్ లో ప్రస్తావించింది. పాలనాపరమైన రాజధానిని ఎంచుకునే హక్కు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పిటిషన్ లో పేర్కొంది. రాజధానిని నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదని హై కోర్టు ఇచ్చిన తీర్పుని ఆ విధంగా సవాల్ చేసింది. అంతే కాదు సమాఖ్య వ్యవస్థకు ఈ తీర్పు ఇబ్బందికరమని పొందుపరిచింది.

Also Read:   Mission 175: తిరుపతి లో రాయలసీమ గర్జన, మిషన్ – 175 స్కెచ్

మూడు రాజధానుల చట్టాన్ని అసెంబ్లీలో రద్దు చేసుకున్నాక హై కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వడాన్ని సుప్రీం లో ప్రభుత్వం సవాల్ చేస్తోంది. ఈ రెండు విషయాల మీద సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంది. అదే టైం లో అమరావతి పరిరక్షణ కమిటీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. కొందరు వ్యక్తులు కూడా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటి మీద సుప్రీం రియాక్ట్ అయ్యే రోజు నవంబర్ ఒకటో తేదీ కావడం గమనార్హం.

పరిరక్షణ కమిటీ తన పిటిషన్ లో చట్టబద్ధంగా ఒక ప్రభుత్వంతో అమరావతి రైతులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాలదన్నే హక్కు ప్రభుత్వానికి లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీయార్డీయే రైతులతో చట్టబద్ధంగా ఒప్పందం చేసుకున్నారు కాబట్టే రైతులు భూములు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కొత్త విధానాన్ని అనుసరిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అని పేర్కొంటోంది. దీంతో ఈ కేసు విచారణ సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. అమరావతి భవిష్యత్తు ఏం జరుగుతుంది అన్నది కూడా ఈ విచారణ తరువాత తేలనుంది. మూడు రాజధానుల అంశాన్ని పొలిటికల్ అజెండాగా తీసుకెళ్తున్న వైసీపీ ఒక వైపు క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తూ ఇంకో వైపు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధం అయింది. ఇదే అంశాన్ని నమ్ముకొని వచ్చే ఎన్నికలకు వెళ్ళడానికి దూకుడుగా వైసీపీ ప్రయత్నం చేస్తుంది.

Also Read:   LB Nagar To Munugode: మునుగోడుకు ఎల్‌బీ నగర్‌కు లింకేంటి? కీలక నేతలు అక్కడే!