AP Debt: అమ్మో! ఏపీ ఇక అప్పాంధ్రప్రదేశేనా! బహిరంగ రుణ పరిమితినీ దాటేసిందిగా!

ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరుకు రూ.లక్షల కోట్లు అప్పులు చేసింది. కానీ ఎంత అప్పు చేసినా ఏటా జీఎస్డీపీలో నాలుగు శాతానికి అది మించరాదు.

  • Written By:
  • Publish Date - March 9, 2022 / 09:38 AM IST

ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరుకు రూ.లక్షల కోట్లు అప్పులు చేసింది. కానీ ఎంత అప్పు చేసినా ఏటా జీఎస్డీపీలో నాలుగు శాతానికి అది మించరాదు. ఇది పదిహేనో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం. ఆ లెక్కన చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్లు మాత్రమే రుణంగా తీసుకోవాలి. కానీ ఏపీ మాత్రం దాదాపు రూ.46 వేల కోట్ల బహిరంగ రుణం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

రాష్ట్రాలు అప్పుల లిస్టును పెంచుతుండడంతో కేంద్రప్రభుత్వం కిందటి సంవత్సరం జూన్ లోనే కొన్ని పరిమితులు విధించింది. కానీ ఇప్పుడు ఏపీ ఆ లిమిట్స్ ను కూడా దాటేసింది. రిజర్వ్ బ్యాంక్.. సెక్యూరిటీల వేలాన్ని నిర్వహిస్తే.. దాని ద్వారా రూ.2000 కోట్ల రుణం తీసుకుంది. కాకపోతే దీనిని దీర్ఘకాల వ్యవధితో తీసుకుంది. ఓ రూ.1000 కోట్లను 7.31 శాతం వడ్డీకి 20 ఏళ్ల వ్యవధితో తీసుకుంటే… మరో రూ.1000 కోట్లను 7.48 శాతం వడ్డీతో 16 ఏళ్ల వ్యవధికి తీసుకుంది.

ఏపీ సర్కారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న అప్పుతో కలిపి ఈ ఏడాదిలో బహిరంగ మార్కెట్ రుణాలు రూ.46 వేల కోట్లకు చేరుకున్నాయి. అంటే కేంద్రం విధించిన నిబంధనలను దాటి మరీ రుణాలు చేసింది. నిజానికి అప్పుల సమాచారం కావాలని కేంద్రం కిందటేడాది మార్చి నెలాఖరులోనే రాష్ట్రాన్ని కోరింది. దాని ప్రకారమే రుణం ఎంత తీసుకోవాలో చెబుతామని అందులో వివరించింది. కానీ రాష్ట్రం మాత్రం సకాలంలో ఆ డీటైల్స్ పంపించలేదు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్ లో అప్పులు తెచ్చుకోవడానికి ఏపీ సర్కార్ ఇబ్బందులు పడింది.

Pic- File Photo