“పెళ్లంటే నూరేళ్ల పంట” అని పెద్దలు చెబుతుంటారు, కానీ నేటి కాలంలో వివాహ బంధాలు బలహీనపడి, పట్టుమని పది రోజులు కూడా నిలబడలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు అనేక కారణాల వల్ల దంపతులు విడిపోవడం సర్వసాధారణమైపోయింది. కొంతమంది అయితే మరింత బరితెగించి భర్తలను లేదా భార్యలను హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లా భీమిలిలో అలాంటి షాకింగ్ ఘటనే జరిగింది, ఇది గృహ హింస తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది.
Jagan Arrest : జగన్ అరెస్ట్‌పై లోకేష్ ఆసక్తికర కామెంట్
విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలోని నేరెళ్లవలస గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భార్య తన నిద్రిస్తున్న భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసి హత్యాయత్నానికి పాల్పడింది. పూర్తీ వివరాల్లోకి వెళ్తే.. నందిక కృష్ణ, గౌతమి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలే చివరికి ఇంతటి ఘాతుకానికి దారితీశాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడిలో నిద్రిస్తున్న భర్త కృష్ణ శరీరం తీవ్రంగా కాలిపోయి, అతనికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు, దంపతుల మధ్య గొడవలు ఒక్కోసారి ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.