భర్తను రోకలిబండతో కొట్టి దారుణంగా హత్యచేసింది భార్య. ఈ ఘటన కడప జిల్లా చిన్నచౌక్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప నకాశ్ కాలనీకి చెందిన సుబ్బు, సుజాతకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు వెదరుబుట్టలు అల్లుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. సుబ్బు మద్యాన్ని బానిసై…రోజు తాగి వచ్చి భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య రెండు నెలల నుంచి వేరే కాలనీలో ఉంటుంది.
సుబ్బు మంగళవారం తెల్లవారుజామున భార్య సుజాత దగ్గరకు వెళ్లాడు. ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఇంట్లో ఉన్న రోకలి బండతో సుబ్బు తలపై బలంగా కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన సుబ్బు చికిత్స పొందతూ మరణించాడు. స్థానికుల సమాచారం ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.