‘దీపావళి’ అనగానే దీపావళి (Deepavali ), దీపోత్సవం లేదా దీపావళి పండుగ హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి అని అంత మాట్లాడుకుంటుంటారు. కానీ దీపావళి పేరుతో ఓ ఊరు (Deepavali Village) ఉందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు..? శ్రీకాకుళం (D) గార (M)లో దీపావళి అనే గ్రామముంది. అక్కడ ప్రజలు 5 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. ఎక్కడాలేని విధంగా పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఈ పేరు రావడానికి పురాణగాథ ఉంది.
నిజానికి వందల ఏళ్ల క్రితం అటు ఒడిశా నుంచీ ఇటు గోదావరి జిల్లాల వరకూ కళింగాంధ్రగా ఉండేది. కళింగ రాజులు ఈ మొత్తం రాజ్యాన్ని పరిపాలించేశారు. ఆ సమయంలో గొప్ప డైనస్టీగా ఉండేది శ్రీకాకుళం. ఇక్కడ ప్రజలలో కూడా ఎక్కవ శాతం కళింగ సామాజికవర్గానికి చెందినవారే. దీంతో ఈ గ్రామానికి అప్పటి కళింగ రాజులు దీపావళిగా పేరు పెట్టారు. దీనికి ఒక కధ కూడా ఉంది. శతాబ్ధాల క్రితం ఓ కళింగ రాజు.. కళింగపట్నం నుంచీ శ్రీకాకుళం వైపు నిత్యం వేట సాగించేవారు. ఆ క్రమంలో ఒకసారి ఈ గ్రామ సమీపంలోనే గుర్రం పై నుంచీ సొమ్మసిల్లి పడిపోయారు. ఈ గ్రామస్థులు రాజు మేల్కొనే వరకూ ఆయనకు సేవలు చేశారు. రాజు మెలుకువ రాగానే ఎక్కడ ఉన్నానని అడగడంతో కళింగపట్నానికి దగ్గరలోనే ఉన్నారని చెప్పారట. ఇది ఏ గ్రామం అంటే.. ఆ గ్రామానికి పేరు లేదని చెప్పారట. దీంతో రాజు.. దీపావళి పండగరోజే తనను మృత్యువును నుంచీ తప్పించనందుకు.. ఆ గ్రామానికి వెలుగుల దీపావళి అని పేరు పెట్టారని చెపుతుంటారు.
ఇక దీపావళి పండగ విషయానికి వస్తే..దీపావళి అంటే “దీపాల వరుస” ఇది వెలుగుల పండుగ అని , ఇది అంధకారాన్ని తొలగించి వెలుగులు మరియు శుభశాంతి నింపే సంకేతంగా భావిస్తారని, ఈ పండగను జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశి జరుపుకుంటారు.
Read Also : Chintalapudi Lift Irrigation Project: రెండు ఫేజ్ లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం!