జనసేనాని పవన్ సత్తా చాటేందుకు మరోసారి నర్సాపురంను టార్గెట్ చేశాడు. లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల వచ్చే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు త్వరలోనే రాజీనామా చేయబోతున్నాడు. ఫిబ్రవరి 15వ తేదీ తరువాత ఏ రోజైనా ఆయన రిజైన్ చేసే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు వస్తే వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.సంక్రాంతి సందర్భంగా త్రిబుల్ ఆర్ నర్సాపురం నియోజకవర్గం పరిధిలోని భీమవరం రావడానికి ప్రయత్నం చేశాడు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించాడు. ఆయనకు ఆహ్వానం పలుకుతూ పలు ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు అక్కడ వెలిశాయి. విచిత్రంగా రఘరామక్రిష్ణంరాజుతో పాటుగా పవన్ కల్యాణ్ ఫోటోలను ఆ ఫ్లెక్సీలు, హోర్డింగ్ ల్లో పెట్టారు. జనసేన మద్ధతు త్రిబుల్ ఆర్ కు సంపూర్ణంగా ఉందని ఆ హవావుడిని చేస్తే అర్థం అవుతుంది. ఆ టైంలో ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడంతో త్రిబుల్ R ఆ టూర్ ను రద్దు చేసుకోవడం ఫ్లెక్సీల హల్ చల్ ఆనాడు సద్దుమణిగిన విషయం చూశాం.
పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్ లో పావులు కావొద్దు. అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనతోనే ముందుకు వెళ్దాం – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/sHEapC2LrL
— JanaSena Party (@JanaSenaParty) January 12, 2022
2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేసి ఓడిపోయాడు. మూడో ప్లేస్ లో నిలిచిన ఆయనకు సుమారు 2లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థికి 3.80 లక్షల ఓట్లకు పైగా నిలవగా, వైసీపీ అభ్యర్థిగా రఘురామక్రిష్ణంరాజు 4లక్షల ఓట్లకు పైగా సాధించి 50వేల ఓట్ల పై చిలుకు ఓట్లతో విజయం సాధించాడు. ఈసారి జనసేన, టీడీపీ, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా త్రిబుల్ ఉప ఎన్నికల్లో నిలిచే అవకాశం ఉంది. పైగా అమరావతి రాజధాని ఎజెండాతో ఆయన నిలవాలని చూస్తున్నాడు. ఎలాగైన వైసీపీ మీద ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా జగన్ ను నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. శత్రువు, శత్రువు మిత్రుడి మాదిరిగా ఉమ్మడి రాజకీయ శత్రువుగా ఉన్న జగన్ పై విజయం సాధించడానికి త్రిబుల్ ను విపక్ష పార్టీలు ఎంచుకుంటాయని రాజకీయ అంచనా.ఉప ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే జనసేనాని రంగంలోకి దిగాడు. అక్కడ నుంచి తెరచాటు పావులు కదిపేందుకు చంద్రబాబు రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఆ క్రమంలోనే పవన్ నర్సాపురం సభ పెట్టుకున్నాడని సమాచారం. ఈనెల 20వ తేదీన బహిరంగ సభ నిర్వహించడం ద్వారా విడతలవారీగా పోరాటాల వేగం అక్కడ పెంచాలని స్కెచ్ వేశారట.
ఆ లోపుగానే త్రిబుల్ ఆర్ రాజీనామా చేస్తాడని తెలుస్తోంది. ఈనెల 15వ తేదీన రాఘురామక్రిష్ణంరాజు స్పీకర్ ఫార్మాట్ లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందిచేస్తారని ఢిల్లీ వర్గాల వినికిడి. ఆ తరువాత జనసేన సభకు కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల సమాచారం. ఒక వేళ ఆ సభకు రాకపోయినప్పటికీ..ఆ తరువాత జరిగే జనసేనాని సభల్లో మాత్రం కనిపిస్తాడని త్రిబుల్ ఆర్ అభిమానుల టాక్.
ఈ నెల 20వ తేదీన నర్సాపురంలో బహిరంగ సభను పవన్ నిర్వహించబోతున్నాడు. అంతేకాదు, ఈనెల 13, 14 తేదీల్లో మత్స్యకార అభ్యున్నతి యాత్రకు ప్రణాళికు రచించాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్దనున్న సూర్యారాపుపేట వద్ద ఈనెల 13న యాత్రకు జనసైన్యం శ్రీకారం చుడుతుంది. రెండు రోజుల పాటు ఆ యాత్ర జరగనుంది. ఆ సందర్భంగా మత్స్యకారుల సాధకబాధకాలను తెలుసుకుంటారు. వాటి పరిష్కారం కోసం భరోసా ఇవ్వడానికి ఈనెల 20వ తేదీన బహిరంగ సభను ఆ పార్టీ నిర్వహించనుంది. మత్స్యకార అభ్యున్నతి సభ ను విజయవంతం చేయడానికి జనసైన్యం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తోంది. జగన్ సర్కార్ అమలు చేస్తోన్న జీవో నెంబర్ 217 కారణంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. ఆ విషయాన్ని హైలెట్ చేస్తూ పవన్ సభ ను సక్సెస్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే నర్సాపురం లోక్ సభ పరిధిలోని ప్రజా నాడిపై సర్వేలు అనేకం చేశారు. వాటి ఆధారంగా త్రిబుల్ ఆర్ రంగంలోకి దిగబోతున్నాడు. ఆయనకు సహకారం అందించడం ద్వారా జగన్ కు చమటలు పట్టించేలా రాజకీయ కసి తీర్చుకోవాలని జనసేన భావిస్తుందట. సో..పవన్ నర్సాపురం సభ త్రిబుల్ ఆర్ భవిష్యత్‌కు బాట వేయనుందన్నమాట.